Telangana Politics : తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులు తీసుకొచ్చిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు

Two graduate MLC election results 2021 : గతంలో గ్రాడ్యూయేట్ ఎన్నికలంటే ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా పెద్దగా తెలిసేది కాదు...

Telangana Politics :  తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులు తీసుకొచ్చిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు
Follow us

|

Updated on: Mar 21, 2021 | 6:34 PM

Two graduate MLC election results 2021 : గతంలో గ్రాడ్యూయేట్ ఎన్నికలంటే ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా పెద్దగా తెలిసేది కాదు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. కాని ఇప్పుడు తెలంగాణలో జరిగిన రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో మార్పులు తీసుకొచ్చాయి. రెండు సీట్లు కైవసం చేసుకున్న అధికార పార్టీ… కొత్త ప్రత్యర్థులను కూడా తెచ్చి పెట్టుకుంది. రాబోయే నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే చర్చ అప్పుడే మొదలైపోయింది.

ఇటీవలి పలు ఎన్నికల ఫలితాల షాకులతో టెన్షన్లో ఉన్న టీఆర్ఎస్‌కు కొత్త జోష్‌.. విజయాలతో దూసుకెళ్తున్న బీజేపీ స్పీడ్‌కు బ్రేక్‌. కాంగ్రెస్‌ మరింత డీలా. ఇండిపెండెంట్‌ల హవా. ఇలా ఉగాది పచ్చడిలా భిన్నరుచులు పరిచయం చేశాయి గ్రాడ్యూయేట్‌ ఎన్నికలు. కోదండరాం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందీ ఎన్నిక. కమ్యూనిస్టు పార్టీలు మనుగడ ఏ పాటిదో మరోసారి చాటిచెప్పింది. తీన్మార్ మల్లన్న లాంటి సామాన్యులు రాజకీయాల్లో అద్భుతాలు చేయగలరని నమ్మకాన్ని పెంచింది.

పేరుకే గ్రాడ్యూయేట్ ఎన్నికలైనా సగం తెలంగాణను కవర్ చేశాయి. జనరల్ ఎలక్షన్ స్థాయిని తలపించాయి. పోటాపోటీ మాటల యుద్ధం, సవాళ్లు ప్రతిసవాళ్లు, ఆరోపణలు కచ్చితంగా గెలిచి తీరాలని కసిని అన్ని పార్టీలో నింపింది ఈ గ్రాడ్యూయేట్ ఎలక్షన్. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. దూకుడు మీదున్న బీజెపికి బ్రేకులు వేసి డీలాపడ్డ టిఆర్ఎస్‌కి బూస్ట్ ఇచ్చింది. కెసిఆర్ వ్యూహం తెలంగాణలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసింది. అయితే విజయం వరించిన ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం కంగారు పెట్టిస్తోంది. పైకి విజయాన్ని ఆస్వాదిస్తున్నా లోలోపల మాత్రం ఆలోచనలో పడ్డారు గులాబీ నేతలు.

సోషల్ మీడియా ప్రభావం పెరగడం, మల్లన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇలాంటి వాళ్లకు పెద్ద ఎత్తున ఓట్లు పడడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ ఎన్నికలు రాబోయే నాగార్జునసాగర్, వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికల మీద కచ్చితంగా ప్రభావం పడుతుందన్న జోస్యాలు మొదలయ్యాయి. ఊపు టిఆర్ఎస్ కొనసాగిస్తూనే జాగ్రత్తగానే అడుగులు వేయాల్సిన అవసరాన్ని చెబుతున్నాయీ ఎలక్షన్. దీనిపై డీప్‌ ఎనాలసిస్ జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. యువతలో పార్టీకి ఉన్న పట్టు, ఎన్నికల సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై దృష్టి పెట్టాలనే చేదు నిజాన్ని నొక్కి చెబుతోందీ ఓట్ల శాతం.

బిజెపికి సిట్టింగ్ సీటు పోయినా డ్యామేజీ పెద్దగా జరగలేదన్నది ఆ పార్టీ నాయకుల వాదన. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినా ఇక్కడ మాత్రం బోల్తాపడటంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి ఫైటే ఇచ్చినా… వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానంలో పరిస్థితి చూసి కంగారు పడుతోందాపార్టీ. ఈ ఎన్నికల్లో ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకత స్పష్టమైందని… ఇది నాగార్జుసాగర్‌ ఎన్నికల్లో కనిపిస్తుందని భావిస్తుంది కాంగ్రెస్. అక్కడ తమకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నందున… సాగర్‌ను ఈజీగా ఈదేస్తామంటూ విశ్లేషిస్తోంది. ఇప్పుడు ఓటు షేరింగ్ కాంగ్రెస్‌కు అంత అనుకూలంగా లేదన్నది నడుస్తున్న టాక్.

ఏ ఎన్నిక జరిగిన ఇండిపెండెంట్‌లది చివరి స్థానమే అయి ఉంటుంది. కానీ ఈ గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో మాత్రం ప్రధాన రాజకీయపార్టీల కంటే ఇండిపెండెంట్‌లే గట్టి పోటీ ఇచ్చారన్నది నిజం. స్వతంత్రులకు పట్టం కట్టే రోజులు వచ్చాయని కొందరు విశ్లేషిస్తున్నారు.

Read also : go maha gharjana : ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో “గో మహా గర్జన” : యుగతులసి ఫౌండేషన్ చైర్మన్