go maha gharjana : ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో “గో మహా గర్జన” : యుగతులసి ఫౌండేషన్ చైర్మన్
Yuga Tulasi Foundation chairman Shivakumar : గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలను మూసివేయాలని..
Yuga Tulasi Foundation chairman Shivakumar : గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గో హత్యలు ఆపాలని, అక్రమ కబేళాలను మూసివేయాలని యుగ తులసి ఫౌండేషన్ ఉద్యమాలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో “గో మహా గర్జన” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యుగతులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యులు శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కొత్తపేట అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో వాసవి సంఘం సభ్యులతో ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించారు. గోమాత ప్రత్యేకత, విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది యుగతులసి ఫౌండేషన్ అని చెప్పారు శివకుమార్.
ముక్కోటి దేవతలు ఒక్క జంతువులో కొలువై ఉన్నాయి అంటే.. అదీ గోమాత అని అన్నారు శివకుమార్. అలాంటి గో మాతను అక్రమంగా కబేళాలకు తరలించడం, చంపి తినడం మానవత్వమే కాదన్నారు. అలాంటి వాటిని అరికట్టాలన్న లక్ష్యంతోనే ఈ ఉద్యమం చేపట్టామన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు శివకుమార్.