సీత కోసం లంకకు వెళ్లడానికి రాముడు తన సైన్యం తో నిర్మించిన వారధి.. రామ సేతు.. రామ సేతు వద్ద ఉన్న సముద్రం పై రాళ్ళను వేస్తే.. అవి ఆ నీటిలో తేలుతాయట.. కానీ ఒక్కప్పుడు ఇక్కడ కూడా రాళ్ళు నీటిలో మునిగిపోయేవట. కానీ లంకకు వెళ్లడానికి రాముడు వానర సైన్యంతో సముద్రం పై ఇక్కడ రామ సేతు నిర్మాణం చేపట్టాడు.. అప్పుడు వంతెన కోసం రాళ్ళు వేస్తుంటే.. నీటిలో మునిగిపోయేవట. అప్పుడు వానర సైన్యం అంతా ఆ రాళ్ళపై శ్రీరామ అని రాశారట. అందుకే ఆ రాళ్ళు మునిగిపోవడం లేదని కొంతమంది చెబుతారు.