‘అధికారి కుటుంబ అసలైన రూపాన్ని గుర్తించలేని నేను’….తనను తానే తిట్టుకున్న మమతా బెనర్జీ
పూర్బా మెడినిపూర్ జిల్లాలో అధికారి కుటుంబ అసలు రూపాన్ని గుర్తించలేని తాను 'గాడిదనని' బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తనను తాను తిట్టుకున్నారు.
పూర్బా మెడినిపూర్ జిల్లాలో అధికారి కుటుంబ అసలు రూపాన్ని గుర్తించలేని తాను ‘గాడిదనని’ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తనను తాను తిట్టుకున్నారు. (మొదట తృణమూల్ కాంగ్రెస్ లో ఉండి.. ఆ తరువాత బీజేపీలో చేరిన సువెందు అధికారి, ఆయన తండ్రి శిశిర్ అధికారి, సోదరుడు దివేందు అధికారి కుటుంబాన్నిఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు). కాంచీ దక్షిణ్ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. రూ. 5 వేల కోట్లతో ఈ కుటుంబం ఓ పెద్ద ప్యాలస్ ని నిర్మించిందన్న వదంతులను తను విన్నానని, తాను మళ్ళీ అధికారంలోకి వస్తే వీటిపై దర్యాప్తు జరిపిస్తానని ఆమె చెప్పారు.ఓట్లను కొనుగోలు చేసేందుకు ఈ కుటుంబం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందని ఆమె ఆరోపించారు. కానీ వీరికి ఓటు చేయకండి అని ఆమె ఓటర్లను కోరారు. అధికారి కుటంబాన్ని దీదీ మీర్ జాఫర్ తో పోల్చారు. బెంగాల్ చివరి ఇండిపెండెంట్ నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా మిలిటరీ జనరల్ అయిన మీర్ జాఫర్ ని దేశద్రోహిగా పరిగణిస్తారు. అధికారి కుటుంబం ఈ జిల్లాను జమీందార్లుగా ‘పరిపాలిస్తోందని’ మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజా సభలను నిర్వహించేందుకు ఇక్కడ తనను కూడా అనుమతించడం లేదని ఆమె పేర్కొన్నారు.
సువెందు అధికారిని ఆమె దేశద్రోహిగా అభివర్ణించారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తను గుడ్డిగా ఆయనను సపోర్ట్ చేశానన్నారు. బీజేపీని ఆమె రోగ్స్, గూండాల పార్టీగా తిట్టిపోశారు. ఆ పార్టీకి నిబద్ధత లేదన్నారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్రజలకు ఇక తిరోగమనమే అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇన్నేళ్ళూ తమ పార్టీ పాలనను ప్రజలు అంగీకరించారని, ఇప్పుడు కూడా అంగీకరిస్తారని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి: ‘దీదీ ! మీరు నా తలను తన్నవచ్చు , కానీ బెంగాలీల కలలను మాత్రం చిదిమిపోనివ్వను, ప్రధాని మోదీ