‘అమెరికా ఇండియాను 200 ఏళ్ళు పాలించింది’, ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్య

అమెరికా ఇండియాను 200 ఏళ్ళు పాలించిందని, మనలను బానిసలుగా చేసిందని, కానీ ఇప్పుడు కరోనా వైరస్ ని అదుపు చేయలేక సతమతమవుతోందని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యానించారు.

  • Umakanth Rao
  • Publish Date - 7:54 pm, Sun, 21 March 21
'అమెరికా ఇండియాను 200 ఏళ్ళు పాలించింది', ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్య
Tirath Singh Rawat

అమెరికా ఇండియాను 200 ఏళ్ళు పాలించిందని, మనలను బానిసలుగా చేసిందని, కానీ ఇప్పుడు కరోనా వైరస్ ని అదుపు చేయలేక సతమతమవుతోందని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్యానించారు. ప్రపంచాన్నంతా కూడా పాలించిన ఆ దేశం ఇప్పుడు ఈ ఈ సమస్యను అదుపు చేయలేక నానా పాట్లూ పడుతోందన్నారు. .ఈ మధ్యే చిరిగిన జీన్స్ పై వ్యాఖ్య చేసి వివాదం సృష్టించిన ఈయన  ఓ వీడియో ప్రసంగంలో ఈ సరికొత్త కామెంట్లు చేశారు.  కోవిడ్ 19 కేసుల్లో ఇండియాను, అమెరికాను ఆయన పోల్చారు. ఈ పాండమిక్ ని ఇండియా  కంట్రోల్ చేయగలిగిందని, కానీ అమెరికా చేతులెత్తేసిందని, ఆ దేశంలో 50 లక్షల కరోనా మరణాలు సంభవించాయని ఆయన చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నారని తీరత్ సింగ్ రావత్ పేర్కొన్నారు. ఈ సమయంలో నరేంద్ర మోదీ తప్ప ఈ దేశానికి మరెవరైనా ప్రధాని అయి ఉంటే ఈ దేశం గతి ఎలాఉండేదో ఎవరికి  తెలుసునన్నారు. మనం చాలా దారుణ పరిస్థితిలో ఉండేవారమని, కానీ ప్రధాని మనకు ఊరటనిచ్చారని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ప్రతివారినీ రక్షించారు.. కానీ ఆయన ఆదేశాలను మనం పాటించడంలేదు..మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలను కొందరు మాత్రమే పాటిస్తున్నారు’ అని రావత్ అన్నారు.  చిరిగిన జీన్స్ ధారణపై ఈయన చేసిన వ్యాఖ్యలను సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, విద్యార్థినులు అంతా దుయ్యబట్టిన  సంగతి తెలిసిందే. ఇంత పెద్ద దుమారం రేగిన  తరువాత ఆయన తన వ్యాఖ్యలకు అపాలజీ చెప్పారు. అయితే మళ్ళీ చిరగని  జీన్స్ ధరిస్తే తనకు అభ్యంతరం లేదన్నారు. తన కామెంట్స్ ఎవరినైనా  బాధించి ఉంటే క్షమించాలని కోరారు. ఇప్పుడు తాజాగా అమెరికా మీద ఓ వ్యాఖ్య చేసి మళ్ళీ వివాదాన్ని ఏదైనా లేవనెత్తుతారేమో !

 

మరిన్ని ఇక్కడ చదవండి: Viral Photo: “నీడ్ ఈజ్‌ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్”.. అడ్డెడ్డె ఏమి ఐడియా గురూ.. సూపర్బ్..

‘అధికారి కుటుంబ అసలైన రూపాన్ని గుర్తించలేని నేను’….తనను తానే తిట్టుకున్న మమతా బెనర్జీ