Viral Photo: “నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్”.. అడ్డెడ్డె ఏమి ఐడియా గురూ.. సూపర్బ్..
"నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్".. ఈ కొటేషన్‌కు యాప్ట్ అయ్యే సందర్భాలు మనం బిజీ లైఫ్‌లో చాలా చూస్తుంటాం. కాగా కొన్ని దృశ్యాలు, చిత్రాలు చూసి తొలుత ఫన్నీగా అనిపించి...
Viral Photo: “నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్”.. ఈ కొటేషన్‌కు యాప్ట్ అయ్యే సందర్భాలు మనం బిజీ లైఫ్‌లో చాలా చూస్తుంటాం. కాగా కొన్ని దృశ్యాలు, చిత్రాలు చూసి తొలుత ఫన్నీగా అనిపించి నవ్వొచ్చినా.. తర్వాత ఐడియా అదుర్స్ అనక మానరు. తాజాగా అటువంటి ఇమేజ్‌నే మీ ముందకు పట్టుకొచ్చాం. ఆడవాళ్లు డాబాపైన వడియాలు పెట్టుకోవడం చాలా కామన్. పల్లెటూర్లలో మాత్రమే కాదు, సిటీలో కూడా నలుగురు, ఐదుగురు ఆడవాళ్లు ఒకచోట చేరి.. ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ పెట్టడం వరకు ఓకే కానీ.. పెట్టిన తర్వాత వాటిని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్. పల్లెటూర్లలో అయితే కోతుల బెడద అధికంగా ఉంటుంది. సీటిల్లో అయితే పక్షులు ముఖ్యంగా పావురాలతో పెద్ద చిక్కొచ్చిపడుతుంది. దీంతో ఎప్పుడూ ఒక మనిషి దగ్గరుండి బాగా ఆరేవరకు వాటిని ఎండబెట్టుకోవాలి. ఇది వారికి చిరాకుగా అనిపించే పనే.
కాగా ఈ చిరాకును ఎన్నిసార్లు అనుభవించారో తెలియదు కానీ.. ఓ మహిళ డాబాపై వడియాలు ఎండబెట్టి.. చుట్టూరా ఈగ కూడా దూరకుండా దోమతెరను పెట్టారు. దీంతో పక్షులు వాటిని తినేందుకు ఆస్కారం లేదు. కోతులు ఈ సెటప్ చూసి భయపడి పారిపోతున్నాయి. ఎండ కూడా నిక్షేపంగా తగులుతుంది. సో.. ఏ బాధ లేదన్నమాట. ఈ ఫోటో ఎక్కడిదో తెలియదు కానీ.. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ సతీమణి లలిత ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీంతో రియాక్షన్లు, కామెంట్లు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ఈ ఐడియా ఇన్నాళ్లు ఎందుకు రాలేదు సుమీ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కొందరు. ఏది ఏమైనా ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కాగా లలిత ఇటువంటి వైరల్ చిత్రాలు చాలానే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. దక్షిణ కొరియాలో మంచి పేరు గడించిన బాయ్ బ్యాండ్ ‘బీటీఎస్’కు ఆమె వీరాభిమాని.
Also Read: పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..
Mongoose Vs Cobra: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది.. ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్…