Mongoose Vs Cobra: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది… ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్…

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ప్రధానమైనది కింగ్ కోబ్రా.  మనిషిని చూడగానే పడగవిప్పి కాటేసేందుకు రెడీ అయిపోతుంది ఈ డేంజరస్ స్నేక్...

Mongoose Vs Cobra: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది... ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్...
Mongoose Vs Cobra
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Mar 22, 2021 | 11:28 AM

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ప్రధానమైనది కింగ్ కోబ్రా.  మనిషిని చూడగానే పడగవిప్పి కాటేసేందుకు రెడీ అయిపోతుంది ఈ డేంజరస్ స్నేక్. అందుకే ఇదంటే చాలామందికి భయం. దాని పేరుకు ముందు కింగ్ అని ఉందంటేనే.. పాముల్లో అది ఎంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పాము కూడా ప్రపంచంలోని ఒక జీవిని చూసి తన ప్రాణాలను కాపాడటానికి లగెత్తడం ప్రారంభిస్తుంది. ఆ జంతువు మరేదో కాదు ముంగిస.  పాము,  ముంగిసల మధ్య శత్రుత్వం చాలా పాతదని మనందరికీ తెలుసు. ముంగిస పామును చూసిన వెంటనే దాన్ని వెంటబడుతుంది.. వేటాడుతుంది. దాన్ని ఖతం చేసేవరకు విశ్రమించదు. తాజాగా కింగ్ కోబ్రా ప్రాణాలు దక్కించుకునేందుకు నక్కి, నక్కి భయపడుతూ ఉండగా.. ముంగిస ఏకబిగిన చెట్టు కొమ్మపైకి దూకి దాని పీకను నోటకరుచుకుంది.

వీడియోని గమనిస్తే, ఒక కింగ్ కోబ్రా పాము చెట్టు దిగువన ఉన్న కొమ్మలపై చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతలో అక్కడకు వచ్చిన ముంగిసను చూసి.. ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఒకసారి చుట్టుప్రక్కల పరిసరాలను గమనించి.. ఒక్కసారిగా పైకి దూకి కోబ్రా పాము మెడ అందుకుంది. సడెన్‌గా జరిగిన ఈ ఇన్సిడెంట్‌తో కోబ్రా బిత్తరపోయింది. ఆపై తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ముంగిస దానికి అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు. అలా పట్టుకుని చెట్ల పొదల వెనక్కి లాక్కెళ్లిపోయింది.  ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ముంగిస స్కిల్స్ చూసి కొందరు షాకింగ్ రియాక్షన్స్ పెడుతున్నారు.

Also Read:  పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..

Meat shops: మంగళవారం మాంసం షాపులు మొత్తానికే బంద్.. తీవ్ర వివాదమవుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం