Shocking Video: సమయానికి అతను దేవుడిలా వచ్చాడు.. లేకపోతే ఘోరం జరిగిపోయేది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ప్రతిరోజూ, సోషల్ మీడియాలో రకరకాలు వైరల్ వీడియోలు సర్కులేట్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆహ్లాదాన్ని కలిగించేవి అయితే మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి.
Viral Video: ప్రతిరోజూ, సోషల్ మీడియాలో రకరకాలు వైరల్ వీడియోలు సర్కులేట్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆహ్లాదాన్ని కలిగించేవి అయితే మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. తాజాగా ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు నెటిజన్లు అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తుంది. కేరళ వాడ్కర్ నుంచి ఈ వీడియో రికార్డయినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, భవనం మొదటి అంతస్తు బాల్కనీలోని పిట్టగోడని ఆనుకుని ఉన్న వ్యక్తి తనపై తన పట్టుని కోల్పోయి అకస్మాత్తుగా వెనక్కిపడబోయాడు. ఆల్మోస్ట్ అతను కిందపడబోతున్న సమయంలో పక్కనే నిలబడి ఉన్న కో-వర్కర్ పడబోతున్న వ్యక్తి కాలుని బలంగా పట్టుకున్నారు. ఇంతలో, మరికొంత మంది కూడా అక్కడకు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని పైకి లాగారు. ఈ సంఘటన తాలుకా సీసీ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. వీడియోలో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి రెప్పపాటులో స్పందించి ఒక నిండు ప్రాణాన్నికాపాడగలిగాడు. సరైన సమయంలో అపస్మారక స్థితిలో పడిపోతున్న వ్యక్తిని అతను పట్టుకోకపోతే, ఒక ఘోర ప్రమాదం జరిగి ఉండేది. దీంతో అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
????? pic.twitter.com/9GPTce1xnt
— Anu Satheesh ?? (@AnuSatheesh5) March 19, 2021
బాల్కనీ నుంచి కింద పడబోయిన వ్యక్తిని బినుగా గుర్తించారు. బినుకు అకస్మాత్తుగా మైకం వచ్చిందని, అందువల్లే నియంత్రణ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. బాల్కనీకి కొన్ని అడుగుల దిగువన కరెంటు వైర్లు ఉన్నాయి. అవి తగిలినా కూడా అతడి ప్రాణాలకు ప్రమాదం వాటెల్లేది. ఏది ఏమైనా అతనికి భూమి మీద గడ్డిగింజలున్నాయని చెప్పుకోవచ్చు.
Also Read: Mongoose Vs Cobra: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది.. ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్…
పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..