AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు గాజు గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!

ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గాజుతో చేసిన గ్యాస్ స్టవ్‌ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ గాజు స్టవ్‌ను సురక్షితంగా ఉపయోగించకపోతే పగిలే అవకాశం ఉంది. కొన్ని రకాల పాత్రలను గాజు గ్యాస్ స్టవ్‌పై ఉంచకూడదు.

మీరు గాజు గ్యాస్ స్టవ్‌పై వంట చేస్తున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!
Protect Your Gas Stove
Prashanthi V
|

Updated on: Mar 17, 2025 | 6:33 PM

Share

ఇప్పటి రోజుల్లో ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ సాధారణంగా ఉంది. మట్టిపొయ్యి, గోపురాలు వంటివి గతం కాగా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ద్వారా వంట చేయడం సులభం అయిపోయింది. మనం వాడే వంట పాత్రలలో కూడా మార్పు వచ్చింది. స్టీల్, అల్యూమినియం పాత్రల బదులుగా నాన్-స్టిక్, సిరామిక్, గాజు పాత్రలను వాడటం ఎక్కువయింది. వీటితో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఆధునికమైంది. గాజుతో చేసిన గ్యాస్ స్టవ్ చాలా మంది ఇళ్లలో కనిపిస్తుంది. అయితే ఈ గాజు గ్యాస్ స్టవ్ మీద కొన్ని రకాల పాత్రలు ఉంచకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన రెగ్యులర్ వంట కోసం పప్పుకి కుక్కర్ వాడటం తప్పనిసరి. కానీ పెద్ద కుక్కర్లు గ్యాస్ బర్నర్‌ను పూర్తిగా కప్పేస్తాయి. ఈ విధంగా కుక్కర్ వాడితే గ్యాస్ సరిగా బయటికి రావడం జరగదు. ఇది గ్యాస్ స్టవ్ మీద ఉన్న గాజు వేడి కారణంగా పగిలే ప్రమాదం ఉంది. అందుకే పెద్ద కుక్కర్లు గాజు గ్యాస్ స్టవ్ మీద పెట్టకూడదు. బాగా జాగ్రత్తగా ఉండటం మంచిది.

గాజు గ్యాస్ స్టవ్ మీద ఎలాంటి పదునైన వస్తువులను ఉంచకూడదు. ఉదాహరణకు కత్తులు, ఫోర్కులు వంటివి గాజు ఉపరితలంపై గీతలు పడేలా చేస్తాయి. ఇవి గాజును చెడగొడతాయి. స్టవ్ లుక్ కూడా మారిపోతుంది. అందుకే గాజు మీద పదునైన వస్తువులు ఉంచకూడదు.

మనం తరచుగా గ్యాస్ బర్నర్ మీద వండిన పాత్రను వెంటనే గాజు స్టవ్ మీద ఉంచుతాం. కానీ ఇలా చేయడం గాజు పగిలే ప్రమాదం కలిగిస్తుంది. వేడి వస్తువులను గాజు ఉపరితలంపై ఉంచితే గాజు వేడి వల్ల వెంటనే పగిలిపోవచ్చు. అందుకే వేడి పాత్రలను గాజు గ్యాస్ స్టవ్ మీద ఉంచకుండా జాగ్రత్తపడాలి.

వంట గదిలో పని చేస్తుంటే మన చేతిలో ఉన్న బరువైన వస్తువులను పొరపాటున గాజు గ్యాస్ స్టవ్ మీద పడేస్తాం. ఇది చాలా ప్రమాదకరం. గాజు స్టవ్ మీద బరువైన వస్తువులు పడితే అవి వెంటనే పగిలిపోతాయి. అందుకే గాజు స్టవ్ మీద బరువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచాలి. తొందరపడి పడవేయకూడదు.

ఇలా గాజు గ్యాస్ స్టవ్ మీద ఏ వస్తువును వాడాలనే విషయంపై జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ స్టవ్ పగలకుండా ఎక్కువకాలం నిలుస్తుంది. వంట చేసే సమయంలో ఏ వస్తువులు ఉంచాలో, ఏవి ఉంచకూడదో తెలుసుకొని సురక్షితంగా వంట చేయడం మంచిది.