ఇల్లు మారుతున్నారా ? అయితే మీ ఆధార్‌లోని ఇంటి చిరునామాను ఇలా క్షణాల్లో మార్చుకోండి..
ఇటీవల మీరు కొత్త ఇంటికి మారిపోయారా ? .. అయితే మీ ఆధార్ కార్డులో ఇంటి అడ్రస్ ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా ? అడ్రస్ ఫ్రూవ్ కోసం ఎలాంటి పత్రాలు
ఇటీవల మీరు కొత్త ఇంటికి మారిపోయారా ? .. అయితే మీ ఆధార్ కార్డులో ఇంటి అడ్రస్ ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా ? అడ్రస్ ఫ్రూవ్ కోసం ఎలాంటి పత్రాలు లేకుండా.. ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్‌ను అప్డేట్ చేసుకునేలా.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొన్ని ప్రాతిపాదనలు తీసుకువచ్చింది.
UIDAI నియమాల ప్రకారం అడ్రస్ వెరిఫైయర్ సహాయంతో ఆన్లైన్లో అడ్రస్ దృవీకరణ పత్రాన్ని పంపడం ద్వారా మీ ఇంటి అడ్రస్ అప్ డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కుటుంబసభ్యుడు, స్నేహితుడు కానీ ఇంటి అడ్రస్ అప్ డేట్ చేయవచ్చు. అందుకు కొన్ని షరతులు ఉంటాయి. వాటిని అంగీకరించిన తర్వాత మీ హోం అడ్రస్ అప్ డేట్ అవుతుంది.
కండిషన్స్..
– రెసిడెంట్, అడ్రస్ వెరిఫైయర్ రెండింటి మొబైల్ నంబర్‌ను సంబంధిత ఆధార్‌తో అనుసంధానించాలి. – నివాసి, చిరునామా ధృవీకరణ తప్పనిసరిగా OTP ద్వారా చేయాలి. – అడ్రస్ వెరిఫైయర్ స్థానంలో నూతన చిరునామాను అంగీకరించాలి.
ఆధార్ కార్డులో చిరునామాను ఎలా అప్ డేట్ చేయాలి..
– UIDAI వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి మై ఆధార్ మెనులో అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ పై క్లిక్ చేయాలి. – వెంటనే రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ వ్యాలిడేషన్ లేటర్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ 12 అంకెల ఆధార్ నంబర్ లేదా.. 16 అంకెల వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. – ఆ తర్వాత కాప్చా క్లిక్ చేసాక్ ఓటీపీని ఎంటర్ చేయాలి. – ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఉన్న అడ్రస్ వివరాలను ఎంటర్ చేయాలి. – ఇప్పుడు మీకు ఒక ఓటీపీతో కూడిన ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. – ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. – ఆ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి.. మీ అడ్రస్ అప్ డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్‍ను క్యాన్సిల్ చేయాలి.
Also Read:
ఈ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు..