Sabarimala temple opens: తెరుచుకున్న శబరిమల ఆలయ తలుపులు.. ఆ నిబంధనలు పాటిస్తేనే దర్శనంకు అనుమతి..
Sabarimala temple opens: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శుక్రవారం తెరుచుకుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఆలయాన్ని తెరిచింది బోర్డు. ‘ఉత్రం’ పండుగ నేపథ్యంలో..
శబరిమల తెరుచుకుంది. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం శుక్రవారం తెరుచుకుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఆలయాన్ని తెరిచింది బోర్డు. ‘ఉత్రం’ పండుగ నేపథ్యంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల 28వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. అయ్యప్పను దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఎట్టకేలకు తెరుచుకుంది. ఉత్రం పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేత పూజలు చేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. ఉత్రం పండుగ నేపథ్యంలో భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశారు. ఈనెల 28 వరకు దేవాలయం తెరిచి ఉంటుందని తెలిపింది.
ఆలయాన్ని సందర్శించే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ రిపోర్టు పత్రాన్ని వెంటతెచ్చుకోవాలని దేవస్థాన బోర్డు స్పష్టం చేసింది. కరోనా నిబంధనల్ని ఆలయ పరిసరాల్లో తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దర్శనం కోసం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు.. నిత్యం పదివేల మంది చొప్పున అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్‌కోర్ బోర్డు పేర్కొంది. కరోనా రిపోర్ట్ లేనిపక్షంలో ఆలయంలోకి అనుమతించడం లేదు.
ఇదిలావుంటే కేరళలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ప్రతీ రోజు అక్కడ మూడు అంకెళ సంఖ్య పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.