Temple Corona: అర్చకులకు సోకిన కరోనా.. తెలంగాణ చిన్న తిరుపతి 15 రోజులు మూసివేత ‌

Temple Corona: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కరోనా కలకలం రేపింది. కరోనా తగ్గిపోయిందని బావిస్తున్న..

Temple Corona: అర్చకులకు సోకిన కరోనా.. తెలంగాణ చిన్న తిరుపతి 15 రోజులు మూసివేత ‌
Temple Corona
Follow us
K Sammaiah

|

Updated on: Mar 20, 2021 | 7:19 AM

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పట్టణాల్లో మళ్లీ రెడ్‌జోన్‌ బ్యానర్లు వెలుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంత కాలంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన మహమ్మారి మరోసారి విరిచుకుపడుతుంది. దీంతో ఆస్పత్రుల్లో పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కరోనా కలకలం రేపింది. కరోనా తగ్గిపోయిందని బావిస్తున్న ఇటీవలి కాలంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కరోనాతో పల్లెలు, పట్టణాలు, పాఠశాలలు ఇప్పటికే వణికిపోతున్నాయి. తాజాగా ఆలయాలకు సైతం కరోనా సోకుతుంది. ముఖ్యంగా దేవుడికి ధూప దీప నైవేద్యాలు సమర్పించే ఆర్చకులకు కరోనా సోకుతుండటం పట్ల ఆందోళన ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

తెలంగాణ లో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులలో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో తోటి అర్చకుల్లో, సిబ్బందికి, భక్తుల్లో ఆందోళన నెలకుంది. పదిహేను రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ వంశీ తెలిపారు. ఆలయ అర్చకులు కరోనా వైరస్ సోకడంతోనే భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అయితే స్వామి వారికి చేసే నిత్యపూజలు, అభిషేకాలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. త్వరలో జరిగే బ్రమ్మో త్సవాలు, స్వామి వారి కల్యాణం ఎలాంటి హంగు ,ఆర్బాటం లేకుండా నిరాడంబరంగా జరిపిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో ప్రత్యక్షంగా భక్తులకు తిలకించే అవకాశం లేకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని, బక్తులు సహకరించాలని ఈఓ తెలిపారు.

కొత్తరూపం సంతరించుకున్న కరోనా రాష్ట్రంలో కరోనా కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవలి వరకు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 70 శాతం మంది వరకు లక్షణాలు లేకపోగా.. ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అంటే వైరస్‌ లక్షణాలు కనిపించేవారి సంఖ్య 10 శాతానికి తగ్గిపోయింది.

గతంలో వైరస్‌ లక్షణాలున్న వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటివి తీవ్రంగా ఉండగా.. ప్రస్తుతం స్వల్పంగా కనిపిస్తున్నాయని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు లేకపోవడం, బాగా తక్కువ లక్షణాలు ఉండటంతో చాలా మంది తమకు ఏమీకాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యక్తులకు వైరస్‌ వ్యాపించే ప్రమాదం నెలకొందని వైద్యారోగ్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా విజృంభిస్తోంది. ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్నవారి ద్వారా వైరస్‌ వ్యాపిస్తోంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడం, చాలా మంది ఒక్కచోటికి చేరుతుండటంతో.. విద్యార్థులకు కరోనా వ్యాపిస్తోంది. టెస్టులు చేసిన స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్‌ కేసులు బయటపడుతుండగా.. పరీక్షలు చేయక వెలుగు చూడని వైరస్‌ బాధితులు ఎందరో ఉన్నారని అంచనా. అలాంటి వారి నుంచి ఇండ్లలో తల్లిదండ్రులకు, పెద్దవయసు వారికి వైరస్‌ సోకుతోంది.

ఇక కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేని సాధారణ స్థితికి వచ్చామన్న భావనతో చాలా మంది మాస్కులు ధరించడం లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెలా రెండు నెలల్లో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని వైద్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్