Schools in Block List: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన.. 259 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు..
Schools in Block List: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 259 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు..
Schools in Block List: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 259 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేసింది. ఈ మేరకకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 259 ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరంలోనే గుర్తింపు గడువు ముగిసిందని, వారు తమ గుర్తింపు రెన్యూవల్ చేసుకోలేదని తెలిపారు. అంతేకాదు.. సదరు పాఠశాలల్లో వసతుల కల్పనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్‌లైన్ నామినల్ రోల్స్‌ను స్వీకరించబోమని సుబ్బారెడ్డి సదరు ప్రకటనలో స్పష్టం చేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జూన్‌లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. విద్యార్థులు సంబంధిత పాఘశాల లాగిన్ ద్వారా తమ తమ పరీక్షల ఫీజును ఆన్‌లైన్ ద్వారా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు చెల్లించవచ్చునని తెలిపారు. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. ఇక రూ. 50 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు చెల్లించవచ్చున తెలిపారు. కాగా, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన పాఠశాలల పూర్తి వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్ www.bse.ap.gov.in తెలుసుకోవచ్చు.
పరీక్ష ఫీజు ఎంతంటే.. 1. ఇక రెగ్యూలర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు 125 చెల్లించాల్సి ఉంది. 2. బ్యాక్‌లాగ్ విద్యార్థులు 3 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.125 చెల్లించాలి. 3. 3 సబ్జెక్ట్‌ల లోపు ఉంటే రూ.110 చెల్లించాలి. 4. నిర్ణీత వయసు కంటే తక్కువ వయసు గల విద్యార్థులు రూ. 300 ఫీజు కట్టాలి. 5. మైగ్రేషన్ సర్టిపికేట్ కోసం రూ. 80 చెల్లించాలి.