AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పెషల్ సర్‏ఫ్రైజ్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీం.. ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‏ను విడుదల చేసిన చిత్రయూనిట్..

Jala jala jalapatham Song: మెగా హీరో వైష్ణవ్ తేజ్.. కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా.. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన సినిమా 'ఉప్పెన'. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్

స్పెషల్ సర్‏ఫ్రైజ్ ఇచ్చిన 'ఉప్పెన' టీం.. 'జల జల జలపాతం నువ్వు' వీడియో సాంగ్‏ను విడుదల చేసిన చిత్రయూనిట్..
Uppena Movie Song
Rajitha Chanti
|

Updated on: Mar 19, 2021 | 11:17 AM

Share

Jala jala jalapatham Song: మెగా హీరో వైష్ణవ్ తేజ్.. కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా.. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన సినిమా ‘ఉప్పెన’. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు.. అందర్నీ మెస్మరైజ్‌ చేస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఫిబ్రవరి 12న రిలీజ్‌ అయిన ఈ సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. ఇక హీరోగా ఇంట్రోడ్యూస్ అయిన వైష్ణవ్‌ తేజను హీరోగా నిలబెట్టడమే కాదు.. హీరోయిన్‌ కృతికి వరుస అవకాశాలను తీసుకొచ్చేలా చేసింది ఈ సినిమా. కరోనా కాలం తరవాత విడుదలైన అన్ని థియేటర్లలోనూ.. ప్రేక్షకాధరణను పొంది. అటు తమిళ్లోకి.. ఇటు హిందీలోకి రిమేక్‌ కాబోతోంది ఉప్పెన సినిమా. సినిమా విడుదలకు ముందే ఇందులోని సాంగ్స్ ఏ రేంజ్‏లో దూసుకుపోయాయో తెలిసిన విషయమే. తాజాగా ఉప్పెన టీం సినీ ప్రియులందరికీ స్పెషల్ సర్ ఫ్రైజ్ ఇచ్చింది..

సినీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న జల జల జలపాతం నువ్వు వీడియో సాంగ్‏ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిచగా.. శ్రేయాఘోషల్, జాస్ ప్రీత్ జాజ్ అద్బుతంగా ఆలపించారు. ఇక ఈ పాట యూత్‏ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మెలోడికి సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరో వైపు ఈ పాటను విడుదల చేసిన కాసేపటికే 32 లక్షల మంది వీక్షించగా.. 1.55 లక్షల మంది లైక్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించారు. ఉప్పెన చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి. ఇప్పటికే భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ‘ఉప్పెన’ బద్దలుకొట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఇండియన్ సినిమాలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ మూవీ నిలిచింది.

Also Read:

Mohan Babu Birthday: డైలాగ్ కింగ్‏ను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమాలు ఇవే..

నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు