Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక.. ఇలా చేస్తే తక్కువ ధరకే సిలిండర్ పొందొచ్చు.!
LPG Subsidy Alert: పెట్రోల్-డీజిల్ ద్రవ్యోల్బణం సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కానీ దాని కంటే ఎక్కువగా, పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల వల్ల..
LPG Subsidy Alert: పెట్రోల్-డీజిల్ ద్రవ్యోల్బణం సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కానీ దాని కంటే ఎక్కువగా, పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల వల్ల సామాన్యుల జేబులు చిల్లుపడుతున్నాయి. గత కొన్ని నెలల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా రూ. 200 పెరగడంతో సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు.
టెన్షన్ పడకండి. మీకోసం ఓ గుడ్ న్యూస్.. సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ రూ. 300 కంటే తక్కువకు లభిస్తుంది. ఈ ఎల్పీజీ సబ్సిడీ కేవలం తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే. మీ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు అయితే ఈ సబ్సిడీకి మీరు అనర్హులు.
వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ ఇస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా, ప్రజల ఖాతాల్లోకి నామమాత్రపు సబ్సిడీ మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అయితే ఎల్‌పీజీపై సబ్సిడీని ప్రభుత్వం తొలగించిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అయితే పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ”ఎల్పీజీపై సబ్సిడీ ఆపలేదని.. సామాన్యులకు ఇది వర్తిస్తుందని” కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని రూ.174.80 నుంచి రూ. 312.80 రూపాయలకు పెంచింది. అయితే ఈ సబ్సిడీ కేవలం ఆ స్కీం కింద రిజిస్టర్ అయినవారికి మాత్రమే.
ఆధార్ అనుసంధానం తప్పనిసరి…
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందాలంటే, మీ ఆధార్ కార్డు.. ఈ పధకంతో అనుసంధానం అయి ఉండాలి. అలా కాకపోతే సబ్సిడీ మొత్తం మీ ఖాతాలోకి పడదు. మొదటిగా ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింకప్ చేసుకోవాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీలో నమోదు కావాలి. ఆధార్ లింక్ చేయకపోతే లేదా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయకపోతే, ఎల్పీజీ సబ్సిడీ సొమ్ము ఖాతాల్లోకి రాదు.
ఎలా నమోదు చేయాలి…
మీ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది మొబైల్ నంబర్ ద్వారా, రెండవది SMS ద్వారా, మూడవది UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా. మీ ఆధార్ నెంబర్ అనుసంధానం అయిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.
ఈ నంబర్‌కు కాల్ చేయండి…
మీరు మొబైల్ నంబర్ నుండి ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్టర్ చేసుకోలేకపోతే, మీరు Indane Gas ఏజెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 2333 5555కు కాల్ చేసి, మీ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయమని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు చెప్పవచ్చు.
మరిన్ని ఇక్కడ చదవండి:
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!