AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Political Parties: రాజకీయ పార్టీలకు విరాళాల వెల్లువ.. జాతీయ స్థాయిలో బీజేపీ.. ప్రాంతీయంగా టీడీపీ

దేశంలో ప్రజల సంగతేమోగానీ.. రాజకీయ పార్టీలు, నేతలు ఏడాది ఏడాదికి సంపన్నులైపోతున్నారు. నేతల సంగతి అటుంచితే.. రాజకీయ పార్టీలు ఈ మధ్య కాలంలో వెల్లువెత్తుతున్న విరాళాలతో సంపన్న పార్టీలుగా మారి, ఆస్తుల విలువ పెంచుకుంటున్నాయి.

Political Parties: రాజకీయ పార్టీలకు విరాళాల వెల్లువ.. జాతీయ స్థాయిలో బీజేపీ.. ప్రాంతీయంగా టీడీపీ
Rajesh Sharma
|

Updated on: Mar 19, 2021 | 5:27 PM

Share

Political Parties becoming richer year by year: దేశంలో సంపన్నుల ఆస్తుల జాబితా పెరిగిపోతున్నట్లే రాజకీయ పార్టీలకు అందే విరాళాలు పెరిగిపోతున్నాయి. దాంతో రాజకీయ పార్టీలు ధనిక పార్టీలుగా మారిపోతున్నాయి. కార్పొరేట్ హౌజెస్ నుంచి రాజకీయ పార్టీలకు వెల్లువెత్తుతున్న చందాలతో దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సంపన్న పక్షాలుగా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ పెరిగిపోతోంది. దాంతో గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల ఆస్తులు గణనీయంగా పెరిగిపోయాయి. గత ఆరేళ్లలో దేశంలో రాజకీయ పార్టీల ఆస్తులు రెట్టింపయ్యాయంటే రాజకీయ పార్టీలకు కార్పొరేట్ హౌజెస్ నుంచి ఏ స్థాయిలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

గత పదిహేనేళ్ళలో దేశంలో జాతీయ పార్టీలన్నీ కలిపి అక్షరాలా 11 వేల 234 కోట్ల రూపాయలను విరాళాలుగా పొందాయి. 2004-05 నుంచి 2018-19 మధ్య కాలంలో రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ బయటపెట్టింది. ఆదాయపన్ను శాఖకు వివిధ పార్టీలు సమర్పించిన రిటర్నుల ఆధారంగా ఏడీఆర్‌ నివేదిక ఇచ్చింది. గత 6 ఏళ్లలో అధికంగా విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా నిలిచిన బీజేపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత ఆరు సంవత్సరాలలో బీజేపీ ఆస్తుల విలువ నాలుగు రెట్లు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంత కాలం ఆ పార్టీకి విరాళాలు ఇస్తూ వచ్చిన కర్పొరేట్ హౌజెస్ ఇపుడు బీజేపీకి ఫండింగ్ చేస్తున్నాయి.

అయితే గత ఏడేళ్ళుగా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు పెద్దగా ఏమీ తగ్గలేదు. ఇప్పటికీ బీజేపీ తర్వాత రెండో స్థాయంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. ఈ జాబితాలో చివరి స్థానంలో వున్న జాతీయ పార్టీగా సీపీఐ నిలిచింది. ఇక ప్రాంతీయ పార్టీలలో సంపన్న పార్టీల జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ సంపన్న పార్టీగా నిలిచింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నిలిచింది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా సంపన్న పార్టీల జాబితాలో రీసెంట్‌గా చేరింది. తాజా గణాంకాల ప్రకారం… 2017-18లో దేశంలోని మొత్తం అన్ని పార్టీల ఆస్తుల విలువ కలిపితే.. రూ. 4,776.71 కోట్లుగా లెక్క తేలింది. ఇందులో జాతీయ పార్టీలవి రూ. 3,456.65 కోట్లు కాగా.. ప్రాంతీయ పార్టీలవి రూ. 1,320.06 కోట్లుగా లెక్క తేలింది. 2018-19లో దేశంలోని మొత్తం అన్ని పార్టీల ఆస్తుల విలువ రూ. 7,372.96 కోట్లు కాగా.. ఇందులో జాతీయ పార్టీలవి రూ. 5,349.25 కోట్లు, ప్రాంతీయ పార్టీలవి రూ. 2,023.71 కోట్లుగా లెక్క తేల్చారు.

ALSO READ: తమిళనాట రాజకీయ పార్టీల ప్రచారం వేగవంతం.. అన్ని సర్వేల్లో ఆ పార్టీనే విజేత!

Follow Us
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..