Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

Grandma spots demon: దెయ్యాల స్టోరీలను మనం తరుచూ సోషల్ మీడియాలో చదువుతుంటాం. వాటిల్లో కొన్ని కల్పితాలు అయితే.. మరికొన్ని...

Viral: తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!
Demon
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 17, 2021 | 3:44 PM

Grandma spots demon: దెయ్యాల స్టోరీలను మనం తరుచూ సోషల్ మీడియాలో చదువుతుంటాం. వాటిల్లో కొన్ని కల్పితాలు అయితే.. మరికొన్ని ఊహకందని ఉంటాయి. అవి వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఇక అలాంటి కదులుతున్న దెయ్యం వీడియో ఒకటి బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలోని లాస్ వేగాస్‌లో నివసిస్తున్న ఓ బామ్మకు మనవడు, మనవరాలు ఉన్నారు. ప్రతీ రోజూ ఈ పిల్లలిద్దరూ తమ గదిలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరితోనో మాట్లాడుతున్నారట. మొదట ఆ బామ్మ.. పిల్లలు నిద్రలో కలవరిస్తున్నారని అనుకుందట. అయితే ఆమెకు అనుమానం వచ్చి.. అసలు ఆ గదిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అనుకుంది. అందులో భాగంగా మోషన్ యాక్టివేట్‌డ్‌ కెమరాను అమర్చింది.

ఇక రెండు రోజుల తర్వాత ఆ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా.. అర్ధరాత్రి వేళ ఏదో ఆకారం కదులుతున్నట్లు కనిపించింది. దానికి తలపై కొమ్ము, పంజాలు ఉన్నాయి. దానిని చూసిన పిల్లలు ఒక్కసారిగా దడుసుకున్నారు. ఆమె మనవరాలు అయితే.. ఆ దెయ్యాన్ని ”వెళ్ళిపో.. వెళ్ళిపో” అంటూ అరుస్తున్నట్లు బామ్మకు వినిపిస్తుంది.

దీనితో ఆ బామ్మ దెయ్యాన్ని ఇంటి నుంచి బయటికి పంపించేందుకు నూనెలను కాల్చడం వంటివి చేయగా.. అప్పుడే ఇంటిలో వింత వింత శబ్దాలు రావడం, డోర్స్, కిటికీలు వాటంతట అవే తెరుచుకోవడం జరిగాయట. ఈ అనుభవాలను ఫోటోతో సహా ఆ బామ్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. నెటిజన్లను సలహా ఇవ్వమని ఆడింది. అంతేకాకుండా తన ఫ్యామిలీ కోసం ఫేక్ ఫోటోలను సృష్టించగలిగే టెక్నికల్ నాలెడ్జ్ తనకు లేదని.. విమర్శలు చేసినవారికి కూడా సమాధానం ఇచ్చింది. ఇంతకీ అసలు నిజమెంతో ఎవరికీ తెలియలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!