Home Loan: హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!

Home Loan Process: మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునే ఒకే ఒక మార్గం హోమ్‌లోన్. వచ్చే చిన్న మొత్తం జీతంతో....

Home Loan: హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.! అయితే ఈ విషయాలను తప్పక గుర్తించుకోండి.. లేదంటే.!
Home Loan
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 16, 2021 | 5:40 PM

Home Loan Process: మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునే ఒకే ఒక మార్గం హోమ్‌లోన్. వచ్చే చిన్న మొత్తం జీతంతో.. బ్యాంక్ నుంచి కాసింత రుణం తీసుకుని తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటుంటారు సామాన్యులు. అయితే ఈ గృహ రుణం తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాలని.. లేదంటే రుణం చెల్లింపు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని బ్యాంకులు సూచిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

స్వల్ప కాలపరిమితి:

సాధారణంగా బ్యాంకులు దీర్ఘకాలిక రుణాల వైపే మొగ్గు చూపుతాయి. అయితే కాలపరిమితి పెరిగే కొద్దీ అసలు కంటే వడ్డీనే ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీ సంపాదనా సామర్ధ్యానికి దృష్టిలో పెట్టుకుని స్వల్ప కాలపరిమితిలో గృహ రుణాలు తీసుకోవడం మంచిది.

వడ్డీ రేటును తగ్గించాలని కోరండి:

గృహ రుణాలు తీసుకునే ఆలోచన ఉన్నప్పుడు మొదటిగానే మీ దగ్గరలోని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. అలాగే ఇతర బ్యాంకులతో ఆ వడ్డీ రేట్లను పోల్చి చూడండి. ఇక మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండి.. నిర్ణీత సమయంలో రుణం చెల్లించే సామర్ధ్యం ఉంటే వడ్డీ రేటును తగ్గించమని సంబంధిత బ్యాంకును కోరండి.

తక్కువ వడ్డీ రేట్లు ఎన్నుకోండి:

హోమ్‌లోన్స్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంక్ ఎంత వడ్డీ రేటు విధిస్తే అంత మొత్తం చెల్లించకుండా.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను ఒకసారి పరిశీలించి.. ఏ బ్యాంక్ అయితే తక్కువ వడ్డీతో గృహ రుణం ఇస్తుందో దాన్ని ఎంచుకోవడం మంచిది.

మెరుగైన క్రెడిట్ స్కోర్:

రుణాలు తీసుకోవడానికి మెరుగైన క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. అయితే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నంత మాత్రాన లోన్ అప్రూవల్ అవుతుందని చెప్పలేం. రుణం ఇచ్చేముందు బ్యాంకులు కస్టమర్ల ఆదాయం, పని చేసే కంపెనీ, వయసు, ఇతరత్రా విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాయి. అందువల్ల ఆన్‌లైన్‌లో ఉండే లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ల ద్వారా మీరు రుణం తీసుకోవడానికి అర్హులో కాదో తెలుసుకోండి.

అలాగే ఇతరత్రా ఫీజుల గురించి కూడా పూర్తిగా తెలుసుకోవడం మంచిది. లేదంటే ఒక్కోసారి వడ్డీ తక్కువే అయినా.. ఈ రుసుముల కారణంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అందుకే రుణం తీసుకునే ముందు ఏవిధమైన రుసుములు ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి.

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!