Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గృహ రుణాలు తీసుకునే వారికి శుభవార్త.. వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆప్ బరోడా.. ఎంత తగ్గించిందో తెలుసా..

Bank Of Baroda : దేశీయ బ్యాంకులు మార్చిలో పోటీపడి మరి గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా దేశీయ మూడో అతిపెద్ద ప్రభుత్వ

గృహ రుణాలు తీసుకునే వారికి శుభవార్త.. వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్ ఆప్ బరోడా.. ఎంత తగ్గించిందో తెలుసా..
Bank Of Baroda
Follow us
uppula Raju

|

Updated on: Mar 16, 2021 | 5:24 PM

Bank Of Baroda : దేశీయ బ్యాంకులు మార్చిలో పోటీపడి మరి గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా దేశీయ మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) కూడా చేరింది. బీఓబీ తాజాగా రెపో లింక్డ్ లెండింగ్ రుణ రేట్లను 6.85 శాతం నుంచి 6.75 శాతానికి 10 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు వెల్లడించింది. ఈ సందర్భంగా బ్యాంకు జనరల్ మేనేజర్ హర్షద్ కుమార్ సోలంకి పలు విషయాలను వెల్లడించారు.

రుణాల రేట్లలో తగ్గింపు ద్వారా వినియోగదారులు తమ బ్యాంకు నుంచి మరింత సరసమైన రుణాలను అందుకుంటారని తెలిపారు. డిజిటల్ ప్రక్రియ ద్వారా ఈ రుణాలను పొందేందుకు మరింత సులభతరం అవుతుందన్నారు. మరింత మందికి రుణాలను అందించేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. మార్చిన రుణ రేట్ల నేపథ్యంలో గృహ రుణాలు 6.75 శాతం నుంచి లభిస్తాయని, వాహన రుణాలు 7 శాతం నుంచి అందనున్నట్టు బ్యాంకు తెలిపింది. అలాగే, తనఖా రుణ రేట్లు 7.95 శాతం, ఎడ్యుకేషన్ రుణాలు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతాయని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది.

తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా తమ ఖాతాదారులకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను 0.05 శాతం మేర తగ్గించింది. ఖాతాదారుల క్రెడిట్‌ చరిత్ర ఆధారంగా, తీసుకునే రుణ మొత్తంతో సంబంధం లేకుండా కొత్త రుణాలకు 6.75 శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు కూడా రుణ రేట్లను తగ్గించాయి. వరుసగా 6.7%, 6.65 శాతానికి రుణాలు అందిస్తున్నాయి. గృహ రుణాలపై రిటైల్‌ ప్రైమ్‌ రుణ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్‌)ను కూడా 0.05 శాతం మేర తగ్గిస్తున్నట్లు, దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న ఖాతాదారులకు కూడా వడ్డీ రేటు ఈ మేరకు తగ్గుతుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

Best Wedding Wardrobe : ఫంక్షన్లకు భిన్నంగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. టాప్ టివి నటీమణుల వివాహ కలెక్షన్లు మీకోసం

Acharya Movie : వెన్నెల కిషోర్ తో కలిసి నవ్వులు పూయించనున్న మెగాస్టార్.. ఆచార్యలో కామెడీ ట్రాక్ అదిరిపోతుందట..

వివాదంలో జోగిని శ్యామల.. పోలీస్ కేసు నమోదు.. మహిళ పై దాడి ఆపై బట్టలు విప్పి..