AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదంలో జోగిని శ్యామల.. పోలీస్ కేసు నమోదు.. మహిళ పై దాడి ఆపై బట్టలు విప్పి..

తెలంగాణాలో  బోనాల పండగ సమయంలో ఆటపాటలతో ఆకట్టుకునే జోగిని శ్యామల వివాదంలో చిక్కుకున్నారు.  ఆమె పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివాదంలో జోగిని శ్యామల.. పోలీస్ కేసు నమోదు.. మహిళ పై దాడి ఆపై బట్టలు విప్పి..
Jogini Shyamala
Rajeev Rayala
|

Updated on: Mar 16, 2021 | 5:04 PM

Share

తెలంగాణాలో బోనాల పండగ సమయంలో ఆటపాటలతో ఆకట్టుకునే జోగిని శ్యామల వివాదంలో చిక్కుకున్నారు.  ఆమె పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పైన లైంగికంగా మానసికంగా దాడికి పాల్పడిందని ఒక మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో జోగిని శ్యామల పై జీరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

దైవ దర్శనానికి వెళ్లిన తనపై శ్యామల దాడి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందని ఆ మహిళ ఆరోపించింది. అంతే కాదు  శ్యామలతో పాటు మరో 15 మందిపైన సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తన దుస్తులు విప్పి.. శ్యామల వీడియోలు తీశారని బాధితురాలు ఆరోపించింది. సికింద్రాబాద్ లోని గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న స్రవంతి తన తల్లి సంధ్య ఈ నెల 12న మెదక్ జిల్లా పాపన్నపేట వన దుర్గాభవానీ దేవాలయ దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న వారికి జోగిని శ్యామల కలిశారు. శ్యామల తాము ఉంటున్న ప్రదేశానికి రావాలంటూ స్రవంతి తన తల్లి సంధ్యను కోరింది. దాంతో వారు జోగిని నివాసానికి వెళ్లారు. అయితే  అప్పటికే అక్కడ  15 మంది పురుషులు మరో మహిళ ఉండటంతో స్రవంతి ఇంట్లోకి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. అయినా జోగిని శ్యామల వినిపించుకోకుండా లోపలి రావాలంటూ శ్యామల అభ్యర్థించడంతో  స్రవంతి తన తల్లి లోనికి వెళ్లారు. ఆతర్వాత శ్యామల వారిపై దాడికి పాల్పడింది. బట్టలు విప్పి ఫోటోలు వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది. తన పై దాడి చేయడమేకాకుండా వివస్త్రను చేసి ఫొటోలు వీడియోలు తీశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఆ కేసును పాపన్నపేట పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇంటి దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసిన వ్యక్తి గుర్తింపు

Zomato Issue: షాకింగ్ ట్విస్ట్.. డెలివరీ బాయ్‌పైనే యువతి చెప్పుతో దాడి.. కేసు నమోదు

విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత.. భోగాపురం ఎయిర్ పోర్ట్ సర్వేను అడ్డుకున్న రైతులు.. కనీస సమాచారం ఇవ్వలేదని మండిపాటు..