ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇంటి దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసిన వ్యక్తి గుర్తింపు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Mar 16, 2021 | 3:47 PM

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో దొరికిన పేలుడు పదార్థాల కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతుంది.

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇంటి దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసిన వ్యక్తి గుర్తింపు
Mukesh Ambani Bomb Scare Case

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో దొరికిన పేలుడు పదార్థాల కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసుకు సంబంధించి ముంబై పోలీసు అధికారి సచిన్ వాజ్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో స్కార్పియో వాహనంలో జెలటిన్ స్టిక్స్ పెట్టి, ఆ కుటుంబానికి బెదిరింపు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంబానీ బెదిరింపుల కేసులో అనుమానితుడిగా అరెస్ట్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను కోర్టు ఈ నెల మార్చి 25 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.

ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్ ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఈ కేసులో కీలక సాక్ష్యంగా భావిస్తున్న హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీంతో ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

మొదట ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో మొదటి దర్యాప్తు అధికారి గా వ్యవహరించింది. ఆ వాహనాన్ని వినియోగించారని చెప్పబడుతున్న పోలీస్ అధికారి సచిన్ వాజే కావడంతో వెంటనే అతనిని బదిలీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు. అయితే, సచిన్ వాజే ఆ స్కార్పియో ఉపయోగించారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీపీ టీవీ ఫుటేజ్ లభించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

ఇక వాజే స్వాధీనం చేసుకున్న డిజిటల్ వీడియో రికార్డ్ నుండి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో ఏమీ లేకపోవడంతో ఈ కేసులో మరింత రసవత్తరంగా మారింది. మొదట ఆరోపణలు ఎదుర్కొన్న సచిన్ వాజే ను సిఐయు నుండి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సచిన్ వాజే‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. దీంతో అయనను సోమవారం సర్వీసు నుంచి సస్పెండ్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీ యొక్క డివిఆర్ మరియు సిసిటివి ఫుటేజ్లను ఎందుకు స్వాధీనం చేసుకున్నారన్న దానిపై ఎన్ఐఏ ఇప్పుడు ఆరా తీస్తుంది. ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మన్సుఖ్ హిరేన్‌తో తన సంబంధాలు బహిర్గతం అయిన తర్వాత అతనిపై ఏవైనా ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం సచిన్ వాజే ఈ పని చేసి ఉండవచ్చని ఎన్ఐఏ అనుమానిస్తుంది. సిసి టివి ఫుటేజ్ తొలగింపుకు సంబంధించి సిఐయు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ రియాజ్ కాజీని కూడా ఏజెన్సీ ప్రశ్నిస్తోంది.

ఇదీ చదవండిః Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విషవాయువు లీక్..!! వ్యోమగాములకు హెచ్చరికలు. ( వీడియో )

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu