విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత.. భోగాపురం ఎయిర్ పోర్ట్ సర్వేను అడ్డుకున్న రైతులు.. కనీస సమాచారం ఇవ్వలేదని మండిపాటు..
Bogapuram Airport : విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ కి అవసరమైన అదనపు భూసేకరణ కోసం
Bogapuram Airport : విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ కి అవసరమైన అదనపు భూసేకరణ కోసం అధికారులు సర్వేకు సిద్ధమయ్యారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు భూ సేకరణ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ అప్రోచ్ రహదారికి అవసరమైన 130 ఎకరాల భూ సేకరణకు గతంలోనే అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే తమని కనీసం సంప్రదించకుండా భూసేకరణకు సిద్ధమవడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్వేను అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో గతంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో భోగాపురం ఎయిర్ పోర్టును త్వరగా నిర్మించేందుకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులకు సంబంధించి పీపీపీ విధానంలో జీఎంఆర్‌కు అప్పజెప్పారు. ఇక ప్రభుత్వం సేకరించిన భూముల్లో సుమారు 2,200 ఎకరాలు మాత్రమే జీఎంఆర్‌కు ఇస్తారు. మిగతా 500 ఎకరాలను ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుతున్నట్లు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయ పనులు ప్రారంభించడానికి జీఎంఆర్ సంస్థ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.