AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura Mutton Biryani: నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ.. ఇలా చేస్తే అచ్చం రెస్టారెంట్‏ టెస్ట్..

సాధరణంగా గోంగూర (పుంటికూర)తో పచ్చళ్లు, కూరలు చేసుకుంటాం. మరి కాస్త డిపరెంట్‏గా అంటే మటన్‏తో కలిపి చేసుకుంటారు. ఇలా కాకుండా.. ఈసారి సరికొత్తగా

Gongura Mutton Biryani: నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ.. ఇలా చేస్తే అచ్చం రెస్టారెంట్‏ టెస్ట్..
Gongura Mutton Biryani
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2021 | 3:06 PM

Share

సాధరణంగా గోంగూర (పుంటికూర)తో పచ్చళ్లు, కూరలు చేసుకుంటాం. మరి కాస్త డిపరెంట్‏గా అంటే మటన్‏తో కలిపి చేసుకుంటారు. ఇలా కాకుండా.. ఈసారి సరికొత్తగా గోంగూర మటన్ బిర్యానీ చేసుకుందామా. అచ్చం రెస్టారెంట్ రుచి రావాలంటే ఇందుకు కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుతుంది. మాములుగా గోంగురలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్‏గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులను నివారించడంలో సహయపడతాయి. ఇన్ని రకాల ఉపయోగాలున్న గోంగురతో ఈసారి కొత్తగా గోంగుర మటన్ బిర్యానీ చెద్దాం.

కావల్సిన పదార్థాలు..

బియ్యం.. కిలో. మటన్.. కిలో. గోంగుర తరుగు.. నాలుగు కప్పులు. పెరుగు.. 2 కప్పులు పచ్చిమిర్చి.. ఏడు నెయ్యి – 1 కప్పు దాల్చిన చెక్క- 2 చిన్న ముక్కలు అల్లంవెల్లుల్లి పేస్ట్ – 3 టేబుల్ స్పూన్స్ లవంగాలు – 4 యాలకులు – 4 కారం – 2 టేబుల్ స్పూన్స్ పుదీనా తరుగు – 4 కప్పులు ఉల్లిపాయ తరుగు – మూడు కప్పులు ఉప్పు – తగినంత

తయారీ విధానం..

ముందుగా బాస్మతి బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నూనె వేసి అందులోనే లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి రెండు నిమిషాల తర్వాత గోంగూర వేయాలి. ఆ తర్వాత పెరుగు, మటన్, కారం, ఉప్పు వేసి సన్నటి సెగపై ఉడికించాలి. మరో గిన్నెలో నీటిని మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అన్నం సగం ఉడికిన తర్వాత అందులో మటన్ వేయాలి. ఆవిరి పోకుండా నిండుగా మూత పెట్టి. 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ రెడి అయినట్టే.

Also Read:

Gutti Vankaya Curry : ఆంధ్ర స్పెషల్ టేస్టీ టేస్టీ ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ విధానము..

Beauty Tips: ముఖానికి నిమ్మరసం మంచి చేస్తుందా? నిమ్మకాయ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..