Beauty Tips: ముఖానికి నిమ్మరసం మంచి చేస్తుందా? నిమ్మకాయ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చర్మ సమస్య ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నోరకాల క్రీములు వాడుతుంటారు. ఇక మార్కెట్లో

Beauty Tips: ముఖానికి నిమ్మరసం మంచి చేస్తుందా? నిమ్మకాయ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..
Lemon Benefits For Face
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2021 | 12:47 PM

ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చర్మ సమస్య ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నోరకాల క్రీములు వాడుతుంటారు. ఇక మార్కెట్లో దొరికే స్కీన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో రకారకాల బ్రాండ్లలో వివిధ చర్మ సమస్యలకు స్కీన్ కేర్ ప్రొడక్ట్ దొరుకుతుంటాయి. అయితే కొంత మందికి ఈ ప్రొడక్ట్స్ వలన ఉన్న సమస్య తగ్గకపోగా.. మరిన్ని సమస్యలు మొదలవుతుంటాయి. అలా జరగకూడదు అనుకుంటే.. మార్కెట్లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ను వాడకుండా.. సహజసిద్ధంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. ఇంట్లో ఉండే పదార్థాలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు.. చర్మసమస్యలను నివారించడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరీ అవెంటో తెలుసుకుందామా.

చిన్న చెట్టు నాటితో చాలు ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఇక చర్మ సమస్యలను నివారించడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ చెట్టును మీ ఇంట్లో నాటి.. రోజూకు కాసిన్ని నీళ్లు పోస్తే చాలు.. ఎన్నో రకాల లాభాలు మీ చేతుల్లోనే ఉంటాయి. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి మాత్రమే కాదు.. దీనిని బ్యూటి పద్ధతుల్లో కూడా వాడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ లో ఏర్పడే బ్లేమిషెస్ తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫ్రూట్ యాసిడ్స్ ఉంటాయి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి మాత్రమే కాకుండా.. నల్లగా ఉండే ప్రదేశాలను కూడా ఇది శుభ్రం చేస్తుంది. కేవలం చర్మ సమస్యలు మాత్రమే కాకుండా.. జుట్టు సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది. నిమ్మకాయలు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

— జిడ్డు చర్మం ఉన్నవారు అర టీ స్పూన్ పసుపు.. రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం మరియు 3 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు తీసుకొని బాగా కలపాలి. దానిని ముఖం మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో కడిగేయాలి. దీనివల్ల ఆయిల్ స్కిన్ తగ్గడమే కాకుండా.. చర్మం పై ఉండే జిడ్డు కూడా తొలగిపోతుంది.

— ఫ్రెకిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా కొంచెం బాదం తీసుకొని వాటిని మెత్తగా నూరండి. దానిలో గుడ్డు, నిమ్మ రసం కూడా తీసుకొని ముఖం మీద అప్లై చేయండి. ఆ తర్వాత 20 నిముషాలు పోయాక శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. దీని వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

— పొడిబారిన చర్మం ఉన్నవారు ఒక టీస్పూన్ తేనే, కొద్దిగా నిమ్మరసం, అర టీస్పూన్ ఉడికించి ముద్ద చేసుకున్న క్యాబేజ్ అన్ని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దానిని ముఖం, మెడ మీద అప్లై చేసి.. 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

— ముఖానికి నేచురల్ బ్లీచ్‏గా పనిచేస్తుంది. ఇందుకోసం టమాటా రసం కొద్దిగా నిమ్మరసం, పాలు సమాన భాగాలుగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు ముఖంపై అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్ క్లీన్ చేయాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉంటే ప్రయోజనం ఉంటుంది.

Also Read:

టూర్ కోసం ప్లాన్ చేసేవారికి కర్టాటక బెటర్ ఆప్షన్.. అక్కడున్న ఉత్తమ పర్యాటక ప్రదేశాలు..