టూర్ కోసం ప్లాన్ చేసేవారికి కర్టాటక బెటర్ ఆప్షన్.. అక్కడున్న ఉత్తమ పర్యాటక ప్రదేశాలు..

పచ్చని ప్రకృతి, బీచ్‏లు, వర్ణిన్ అడవులు, కొండలు, జలపాతాల మధ్య సేదతీరాలని చాలా మంది అనుకుంటారు. చాలా మంది తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి

టూర్ కోసం ప్లాన్ చేసేవారికి కర్టాటక బెటర్ ఆప్షన్.. అక్కడున్న ఉత్తమ పర్యాటక ప్రదేశాలు..
Karnataka Tourist Places
Follow us

|

Updated on: Mar 16, 2021 | 11:45 AM

పచ్చని ప్రకృతి, బీచ్‏లు, వర్ణిన్ అడవులు, కొండలు, జలపాతాల మధ్య సేదతీరాలని చాలా మంది అనుకుంటారు. చాలా మంది తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి టూర్ ప్లానింగ్స్ వేస్తుంటారు. అందులో చాలా మంది గోవా వెళ్తుంటారు. కొద్ది రోజులు ప్రశాంతంగా మీ ఒత్తిడిని జయిస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరాలంటే మాత్రం చెప్పుకోవాల్సింది కర్ణాటక ప్రాంతం. ఇది వన్యప్రాణుల అభయారణ్యాలతోపాటు దేశంలోని అత్యుత్తమ బీచ్‏లను కలిగి ఉంది. మీరు టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు సరైన ప్రాంతం కర్ణాటక అనడంలో సందేహం లేదు. ఎటు చూసిన పచ్చని ప్రకృతి.. చుట్టు అడువులు.. వాటి మధ్యలో అందమైన జలపాతాలు.. వీటన్నింటితోపాటు సేదతీరడానికి సముద్ర తీరాలు. ఇలా అన్ని కలగలిపి ఉన్నాయి. కర్ణాటకలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలెంటో తెలుసుకుందామా.

దండేలి..

Dandeli

Dandeli

ఇది ఉత్తర కర్ణాటక పశ్చిమ కనుమలలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాభా ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడ కాశీ నది ఉండడం వలన వైట్ వాటర్ రాప్టింగ్, కానోయింగ్, కయాకింగ్, రాపెల్లింగ్ వంటి అద్భుతమైన వాటర్ స్పార్ట్స్‏ ఉన్నాయి. ఇక ఈ ప్రాంతం చుట్టూ నది ఉండడం.. హార్డ్ బిల్ వంటి పక్షులు ఇక్కడ అధికంగా ఉంటాయి. అలాగే ఇది వన్యప్రాణుల అభయారణ్యం. ఇక్కడ నేషనల్ పార్క్ ఉంటుంది. దండేలి పట్టణానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుపా డ్యామ్ కూడా దండేలిలో ఉంది. ఇక్కడ శిరోలి శిఖరం, దండేలప్ప ఆలయం, సింథేరి రాక్స్ ప్రసిద్ద పర్యాటక ప్రాంతాలు..

చిక్మగళూరు..

Chikmagalur

Chikmagalur

కర్ణాటకను కాఫీ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. చిక్మగళూరు ముల్లయం శ్రేణికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ట్రెక్కింగ్, అన్వేషకులలో ప్రసిద్ది చెందింది. ఇక్కడ అత్యధికంగా దేవాలయాలు ఉన్నందున దీనిని ఆద్యాత్మిక తిరోగమనం అంటారు. 3400 అడుగుల ఎత్తులో ఉన్న చిక్మగళూరు జారీ జలపాతాలు, శంకర్ జలపాతం, హనుమాన్ గుండి జలపాతాలు, కదంబి జలపాతాలు ఉన్నాయి.

హంపి..

Hampi

Hampi

హంపి ఉత్తర కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక అందమైన ఆలయం ఉంది. ఇది పూర్వం విజయనగర రాజవంశం యొక్క పూర్వ రాజధాని. దీనికి కొంతవరకు రామాయణ సంఘటనలతో అనుబంధం ఉంది. పురాణాల ప్రకారం దీనిని పూర్వం కిష్కంద అనేవారు. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు కలుసుకున్నట్లు చెబుతారు. హంపి ప్రపంచంలోనే కలిసి వారి రెండవ అతిపెద్ద నగరం. ఇక్కడ యంత్రోధరక హనుమాన్ దేవాలయం, రాతి రథం, విరూపాక్ష ఆలయం, విఠాల ఆలయం, నంది విగ్రహలు సందర్శించాల్సిన ప్రదేశాలు.

గోకర్ణ..

Gokarna

Gokarna

ఓంబీచ్, హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ వంటి సహజమైన బీచ్‏లకు ప్రసిద్ధి. ఇక్కడ మహాబలేశ్వర ఆలయం ఉంది. అంతేకాకుండా సైక్లింగ్, ట్రెక్కింగ్, పర్వాతరోహణలు ఇక్కడ అధికంగా ఉంటాయి. ఇవన్ని గోకర్ణకు యానా పట్టణంలో ఇవన్ని ఉంటాయి. ఈ ప్రదేశం శీతకాలంలో సందర్శించడానికి అనువైన ప్రదేశం.

Also Read:

అల్లం గొంతునొప్పిని తగ్గిస్తుందా ?… ఎలా తీసుకుంటే తొందరగా ఉపశమనం లభిస్తుందంటే..