Thrissur Pooram : త్రిస్సూర్ పూరం ఉత్సవాలకు అనుమతినిచ్చిన కేరళ ప్రభుత్వం.. కండిషన్స్ అప్లై

కేరళలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే పండుగల్లో ఒకటి త్రిస్సూర్ పూరం. ఈ పండగను గత ఏడాది కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నిర్వహించలేదు. అయితే ఈ సంవత్సరం త్రిస్సూర్ పూరం...

Thrissur Pooram :  త్రిస్సూర్ పూరం ఉత్సవాలకు అనుమతినిచ్చిన కేరళ ప్రభుత్వం.. కండిషన్స్ అప్లై
Thrissur Pooram
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2021 | 11:56 AM

Thrissur Pooram : కేరళలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే పండుగల్లో ఒకటి త్రిస్సూర్ పూరం. ఈ పండగను గత ఏడాది కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నిర్వహించలేదు. అయితే ఈ సంవత్సరం త్రిస్సూర్ పూరం ఉత్సవాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఈ వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని సూచించింది.
దీంతో పూరం పండగ జరుపుకోవడానికి అనుమతి లభించిన నేపథ్యంలో భక్తులు, దేవాలయాల పతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాన కార్యదర్శి పిజె జాయ్ సమక్షంలో జరిగిన సమావేశంలో త్రిస్సూర్ పూరంను అన్ని  ఏనుగులు, సంగీతం, ఉత్సాహభరితమైన పెద్ద పెద్ద గొడుగుల ప్రదర్శనతో నిర్వహించడానికి అనుమతినిచ్చింది.  దీంతో తిరువంబడి మరియు పరమేక్కవు దేవస్థానం తో పాటు కొచ్చిన్ దేవస్థానం బోర్డు, ఈ ఉత్సవంలో పాల్గొనే ఇతర  దేవాలయాల అధికారులు పూరం మరియు ప్రదర్శనకు సన్నాహాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఇదే విషయంపై జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పండగను నిర్వహించుకోవాలని తెలిపారు. అంతేకాదు పూరం ఎగ్జిబిషన్‌లోకి ప్రవేశించడానికి ఇ-టికెటింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. నగర పోలీసులు ఈ-టికెటింగ్‌ను నిర్వహిస్తారు.  పూరం వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను నియంత్రించాలని సమావేశం నిర్ణయించింది. అందుకనే పూరం వెదుల్లల్లో పాల్గొనే భక్తులకు టికెట్ పెట్టమని.,. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. 

 సంవత్సరం ఏప్రిల్ 23 న త్రిస్సూర్ పూరం వస్తుంది. ఎగ్జిబిషన్ పండుగకు ఒక నెల ముందు ప్రారంభమవుతుంది. ఇక్కడ వేలాది మంది వందలాది స్టాళ్లను సందర్శిస్తారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో, ఈసారి స్టాళ్ల సంఖ్య తగ్గవచ్చునని తెలుస్తోంది. 

ఈ త్రిస్సూర్ పూరం 18వ శతాబ్ధపు కొచ్చి రాజు శక్తి తంపురాన్  జరపడం మొదలు పెట్టారు. ఈ ఉత్సవం 36 గంటలపాటు సాగుతుంది. పూరం ఉత్సవాలకు వేదికగా తెక్కింకాడు మైదానంకానున్నది. ఇక్కడ కేరళలోని ముఖ్యమైన 10 దేవాలయాల దేవతలు సమావేశం అవుతారని భక్తుల నమ్మకం.  అయితే కాలక్రమంలో ఈ పూరం వేడుకక్కి తిరువాంబడి మరియు పరమెక్కావు ఆలయాలు మాత్రమే ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇక ఈ ఉత్సవం అద్భుతంగా అలంకరించబడిన ఏనుగులు, సంగీతం, ఉత్సాహభరితమైన పెద్ద పెద్ద గొడుగుల ప్రదర్శన కుడమట్టొమ్ కు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది ఈ పూరం ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. గత ఏడాది కోవిడ్ నేపథ్యంలో ఉత్సవాలను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.,.

Also Read:

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటే ‘భయపడిపోతున్న’ యూరప్ దేశాలు, తాజాగా బ్యాన్ చేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా,

వ్యాక్సిన్ తీసుకున్నా.. గుజరాత్‌ మంత్రికి కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన ఈశ్వర్ సింగ్..