Covid vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా.. గుజరాత్‌ మంత్రికి కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన ఈశ్వర్ సింగ్..

Gujarat minister Ishwarsinh Patel: దేశంలో కరోనావైరస్ ఉధృతి వేగంగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో కరోనా కట్టడికి ఇటు కేంద్రం, అటు

Covid vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా.. గుజరాత్‌ మంత్రికి కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన ఈశ్వర్ సింగ్..
Gujarat Minister Ishwarsinh Patel,
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 16, 2021 | 11:49 AM

Gujarat minister Ishwarsinh Patel: దేశంలో కరోనావైరస్ ఉధృతి వేగంగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో కరోనా కట్టడికి ఇటు కేంద్రం, అటు రాష్ట్రాలు సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కరోనా నుంచి కాపాడేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పలువురు కరోనా బారిన పడుతుండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గుజరాత్ క్రీడాశాఖ మంత్రి ఈశ్వర్ సింగ్ పటేల్ సైతం కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఈశ్వర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈశ్వర్ సింగ్ అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని.. ఇటీవ‌ల త‌నను క‌లిసిన వారంతా కరోనావైరస్ పరీక్షలు చేయుంచుకోవాలని ఈశ్వర్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈశ్వర్ సింగ్ మార్చి 13న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా కూడా అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణకావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఉద్ధవ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 3,29,47,432 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రధాని సీఎంలతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు.

Also Read:

Coronavirus India: దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

నువ్వా ? నేనా ? ఫైట్ కి జడిసిందా ? తోక ముడిచిందా ? కర్నాటకలో పైథాన్ ని చూసి పులి ఏం చేసిందో చూడాల్సిందే !

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!