నువ్వా ? నేనా ? ఫైట్ కి జడిసిందా ? తోక ముడిచిందా ? కర్నాటకలో పైథాన్ ని చూసి పులి ఏం చేసిందో చూడాల్సిందే !

దారికి అడ్డంగా  స్పీడ్ బ్రేకర్ లా ఓ భారీ కొండ చిలువ కనబడితే ఏం చేస్తాం ? భయంతో ఆ పైథాన్ ని దాటి వెళ్లగలుగుతామా ? దాడికి రెడీగా ఉన్నట్టున్న ఆ పైథాన్ ని చూసి హడలెత్తి వెనక్కి పరుగు లంకించుకొంటాం..

నువ్వా ? నేనా ? ఫైట్ కి జడిసిందా ? తోక ముడిచిందా ? కర్నాటకలో పైథాన్ ని చూసి పులి ఏం చేసిందో చూడాల్సిందే !
When A Tiger  Came Across A Huge Python In Karnataka
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 16, 2021 | 10:42 AM

దారికి అడ్డంగా  స్పీడ్ బ్రేకర్ లా ఓ భారీ కొండ చిలువ కనబడితే ఏం చేస్తాం ? భయంతో ఆ పైథాన్ ని దాటి వెళ్లగలుగుతామా ? దాడికి రెడీగా ఉన్నట్టున్న ఆ పైథాన్ ని చూసి హడలెత్తి వెనక్కి పరుగు లంకించుకొంటాం.. మళ్ళీ తిరిగి చూసే ధైర్యమే ఉండదు. అసలు మొదట ఏం చేయాలో తోచనే  తోచదు కూడా..మరి జంతువులు మాత్రం అలా ప్రవర్తిస్తాయంటే వాటిలోనూ భయమున్న కారణంగానే.. కర్నాటకలోని నాగర్ హోల్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ లోకి ఒక్కసారి కాలు పెడదాం.. వన్యప్రాణుల సంరక్షణా కేంద్రమైన ఈ జంతువుల ‘పార్క్’ లో తన మానాన తాను వెళ్తున్న పులికి దారికి అడ్డంగా ఓ భారీ కొండచిలువ కనిపించింది.  పులి తలచుకుంటే దానితో ఫైట్ చేయగలదు కూడా.. దాని తోక భాగాన్ని తన పదునైన కోరలతోపట్టుకుని చీల్చి చెండాడగలదు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ పైథాన్ ని చూసిన పులి కొద్దిసేపు షాక్ తిని అక్కడే ఉండిపోయింది. ఏం చేయాలో దానికి తోచలేదు. దాని దగ్గరే తచ్చాడింది. దానిపై ఎటాక్ చేయాలా ? లేక తోక ముడవాలా ? అని ఆలోచించినట్టు కనబడింది. కొండచిలువపై దాడి చేయాలనుకునే లోపు అది ఒక్కసారిగా పులిపైనే ఎటాక్ కి యత్నించింది. దీంతో భయపడిన పులి వెనక్కు..పొదలవైపు మళ్లింది. మళ్ళీ తిరిగి వచ్చి భయంకర సర్పం దగ్గరకు వచ్చి… తిరిగి వెనక్కి మళ్లింది.  సుమారు 15 నిముషాల సేపు ఈ  ‘దాగుడుమూతలు’ సాగాయి. మొత్తానికి  ఎంతటి క్రూర జంతువుకైనా భయం అన్నది తప్పదని తెలుస్తోంది.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీస సుశాంత్ నందా ఈ వీడియోను తన ట్విటర్ లో షేర్ చేశారు. అంతకుముందు నేచురలిస్ట్ శరత్ అబ్రహం కబిని రిసార్ట్స్ వద్ద ఈ క్లిప్ తీశారు. 2018 నాటిదైనా ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

మరిన్ని చదవండి ఇక్కడ : సీఎం జగన్ కు… తాగుబోతుల విన్నపం ..!వైరల్ అవుతున్న లెటర్.: drunkards request CM Jagan Video

కార్తికేయ వర్సెస్ లావణ్య : చావు కబురు చల్లగా టీం ఆడిన క్రికెట్ మ్యాచ్ లో గెలుపెవరిది ?:Chaavu Kaburu Challaga Team Cricket Match Video

బుమ్రా సీక్రెట్ పెళ్లి..!టీవీ యాంకర్‌ను సడెన్‌గా పెళ్లి చేసుకున్న స్పీడ్ బౌలర్ : Jasprit Bumrah marries Sanjana Ganesan Video.

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే