Coronavirus India: దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

Covid-19 India news: దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలం క్రితం పదివేలకు దిగువన నమోదైన కరోనా కేసులు కాస్త.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి 20వేలకు పైగా కేసులు

Coronavirus India: దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
Covid-19 India news
Follow us

|

Updated on: Mar 16, 2021 | 10:05 AM

Covid-19 India news: దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలం క్రితం పదివేలకు దిగువన నమోదైన కరోనా కేసులు కాస్త.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి 20వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,492 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,09,831 (1.14 కోట్లు) కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 131 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,58,856 కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కరోనా కేసులతో పోల్చుకుంటే.. డిశ్చార్జ్‌ల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. కరోనా నుంచి నిన్న 20,191 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,10,27,543 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,23,432 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 96.65 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.39 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8,73,350 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 15వ తేదీ వరకు మొత్తం 22,82,80,763 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 3,29,47,432 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రధాని సీఎంలతో సమీక్షించనున్నారు.

Also Read:

COVID19 Vaccination: దేశంలో వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 3.17 కోట్లు దాటిన లబ్ధిదారుల సంఖ్య

Highest Denomination: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన.. డిమాండ్‌ ఉంటే నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి