AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Highest Denomination: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన.. డిమాండ్‌ ఉంటే నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి

Rs 2000 currency notes: మార్కెట్లో 2వేల రూపాయల నోటు పెద్దగా కన్పించడం లేదు. ఎందుకో తెలుసా? ఆ నోటు ముద్రణను రెండేళ్ల క్రితమే కేంద్రం ఆపేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ లోక్‌సభలో చెప్పారు.

Highest Denomination: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన.. డిమాండ్‌ ఉంటే నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి
Rs 2000 Currency Notes
Sanjay Kasula
|

Updated on: Mar 16, 2021 | 8:17 AM

Share

Rs 2000 Currency Notes: రెండు వేల రూపాయల కొత్త నోటు గురించి లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా 2 వేల రూపాయల నోట్ల ముద్రణ జరగలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 2019 నుండి 2000 రూపాయల కరెన్సీ నోట్లను ముద్రించలేదని అన్నారు. ప్రజల ఆర్థిక లావాదేవీల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐతో సంప్రదించి నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

2018 మార్చి 30నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి సంఖ్య 3.27 శాతం కాగా 2021 నాటికి అది 2.01 శాతంకి తగ్గినట్లు తెలిపారు. 2000 రూపాయల విలువ 336.2 కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇది వ్యవస్థలోని మొత్తం వాల్యూమ్‌లో 3.27 శాతంగా నిర్ధారించారు.

డేటా ప్రకారం.. 26 ఫిబ్రవరి 2021 నాటికి రూ .2,000 విలువైన 249.9 కోట్ల కరెన్సీ చెలామణిలో ఉంది. రిజర్వ్ బ్యాంకుతో సంప్రదించిన తరువాత ఒక నిర్దిష్టంగా నోటును ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు.

అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..

2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2000 రూపాయల విలువైన నోట్లను ముద్రించలేదని అన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2016 నుండి మార్చి 2017 వరకు) రూ .2,000 విలువైన 3542.991 మిలియన్ నోట్లను ముద్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2019 లో పేర్కొన్నారు. అయితే 2017-18లో 2 వేల రూపాయల 111.507 మిలియన్ నోట్లు 2018-19లో 46.690 మిలియన్ కొత్త నోట్లను ముద్రించినట్లుగా వెల్లడించారు. ప్రజలు కూడా ఆ నోటును వినియోగించడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. అందుకే రెండేళ్ల క్రితమే నోట్ల ముద్రణ ఆపేసినట్టు వివరణ ఇచ్చింది.

2016లో 2000 నోటు ముద్రణ

భారత్‌లో 2016లో 2000 నోటు ముద్రణ ప్రారంభమయ్యింది. నోట్ల రద్దుతో 1000 , 500 నోట్లను ఉపసంహరించిన తరువాత కేంద్రం 2000 నోటును తీసుకొచ్చింది. అంతేకాకుండా దేశంలో అవినీతి పెరగడానికి పరోక్షంగా 2000 నోట్లు ఉపయోగపడుతున్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి. కేంద్రం నిర్ణయం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే 2000 నోటును రద్దు చేయలేదని , కేవలం ప్రింటింగ్‌ మాత్రమే నిలిపివేసినట్టు పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. 2000 నోటు చలామణిలో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలకు దీనిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆర్‌బీఐ కూడా వివరణ ఇచ్చింది. సర్క్యులేషన్‌లో ఉన్న నోట్లు మాత్రమే చలామణిలో ఉంటాయి. కాకపోతే కొత్తగా 2000 నోట్లను ముద్రించరు. ఇది క్లారిటీ అంటూ కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.

కొత్త నోట్లు..

అయితే, ప్రభుత్వం 500 రూపాయల కొత్త నోట్లను ముద్రించగా, 1,000 రూపాయల కరెన్సీ నోట్లను నిలిపివేసింది. దాని స్థానంలో 2 వేల రూపాయల నోటు ప్రవేశపెట్టబడింది. ఇవే కాకుండా 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు కొత్త నోట్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

గ్రహంపై గంటల శబ్దం , మాటల గుసగుసలు..!ఆడియో విడుదల చేసిన నాసా.:The NASA delivered audio by lazers video.