UPI వినియోగదారులకు గుడ్‏న్యూస్.. యూపీఐ హెల్ప్‏లైన్ సేవలను ప్రారంభించిన ఎన్‏పీసీఐ..

కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి పారదర్శకతపాటు కస్టమర్ ఫ్రెండ్లీ మెకానిజంను అభివృద్ధి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది. నేషనల్

UPI వినియోగదారులకు గుడ్‏న్యూస్.. యూపీఐ హెల్ప్‏లైన్ సేవలను ప్రారంభించిన ఎన్‏పీసీఐ..
Upi Payments
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2021 | 1:17 PM

కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి పారదర్శకతపాటు కస్టమర్ ఫ్రెండ్లీ మెకానిజంను అభివృద్ధి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భీమ్ యూపీఐపై యూపీఐ-హెల్ప్ సేవలను ప్రారంభించింది. దీంతో భీమ్ యూపీఐ అనువర్తన వినియోగదారులు ఇప్పుడు వారి సమస్యలను మరింత మెరుగ్గా పరిష్కరించుకోవచ్చు. యూనిపైడ్ పేమెంట్ ఇంటర్పేస్ ద్వారా ఒక మొబైల్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు తక్షణమే డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఈ యూపీఐ ఉపయోగించుకోవాలంటే ముందుగా ఏదైనా బ్యాంకులో ఖాతా ఉండి తీరాలి.

కొత్త హెల్ప్ డెస్క్ ప్రారంభం…

UPI-HELP BHIM ద్వారా UPI వినియోగదారులు తమ ఫోన్లలో ఉన్న పేమెంట్ యాప్‏లు కొన్ని రకాల సేవలను ఉపయోగించుకోవచ్చు. — పెండింగ్‏లో ఉన్న లావాదేవీల కోసం మీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. — ప్రాసెస్ చేయని లేదా మీరు పంపే నగదు ఎదుటి ఖాతా వ్యక్తికి చేరకపోయిన ఫిర్యాదు చేయవచ్చు. — బిజినెస్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను చేయండి. ఈ యూపీఐ హెల్ప్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి లావాదేవీల కోసం ఫిర్యాదులను ఆన్ లైన్ లోనే పరిష్కరించవచ్చు. ఇవే కాకుండా.. లావాదేవీలు ఆగిపోయిన లేదా పెండింగ్ లో ఉన్నా.. యూపీఐ హెల్ప్ లావాదేవీల వీటిని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ సేవలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారుల కోసం భీమ్ యాప్ లో ఈ సేవలు ప్రారంభమయ్యయి. త్వరలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, టీజెఎస్పీ కోఆపరేటివ్ బ్యాంక్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

వినియోగదారులను డిజిటల్ చెల్లింపులను మరింత నమ్మకంగా స్వీకరించడంతోపాటు, నగదు రహిత లావాదేవిల మార్గాన్ని అనుకరించడానికి odrను ప్రవేశపెట్టింది. కస్టమర్ల రక్షణ కోసం డిజిటల్ చెల్లింపుల సమస్యల పరిష్కారానికి యూపీఐ హెల్ప్ సేవలను ఇతర బ్యాంకులకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. భవిష్యత్తులో కస్టమర్ ప్రూఫింగ్, ఫిర్యాదులు స్వీకరించడంలో మరిన్ని అప్ డేట్స్ తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ యూపీఐ హెల్ప్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువ మంది ఈ యూపీఐ లావాదేవీలను విశ్వసించనున్నట్లుగా.. అలాగే..మనీ ట్రాన్స్ ఫర్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

Also Read:

Highest Denomination: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన.. డిమాండ్‌ ఉంటే నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి