Bank Strike Today: రెండో రోజూ కొనసాగుతున్న బ్యాంక్ స్ట్రైక్.. నిలిచిపోయిన లావాదేవీలు..

Bank Strike: బ్యాంకు ఉద్యోగుల స్ట్రైక్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు..

Bank Strike Today: రెండో రోజూ కొనసాగుతున్న బ్యాంక్ స్ట్రైక్.. నిలిచిపోయిన లావాదేవీలు..
Bank Strike
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 16, 2021 | 1:35 PM

బ్యాంకు ఉద్యోగుల స్ట్రైక్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు నిర్వహిస్తున్నారు. దీంతో రెండు రోజులపాటు ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు సోమవారం, మంగళ రెండు రోజుల నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునివ్వడంతో సమ్మె కొనసాగుతోంది.

సమ్మె వల్ల బ్యాంకులలో డిపాజిట్లు మరియు విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్ మరియు లోన్ అప్రూవల్స్ సహా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి. అదే సమయంలో ఖాతాదారులకు ఏటీఎంలు సేవలు అందింస్తుండటంతో కొంత రిలీఫ్‌ ఉంది.

నేటి నుంచి 2 రోజులపాటు జరగనున్న బ్యాంకు సమ్మెలో 10 లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకుల అధికారులు పాల్గొంటారని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వెల్లడించింది. మార్చి 4, 9, 19 తేదీల్లో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె బాట పట్టినట్లుగా యూనియన్ నాయకులు తెలిపారు.

ఇదిలావుంటే… ప్రైవేటు బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాంకులు యథాతథంగా విధులు నిర్వహిస్తున్నాయి.

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన పిలుపుతో‌ తొమ్మిది బ్యాంక్ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఇందులో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్లు, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

ఇవి కూడా చదవండి

Signal App Stops Working: డ్రాగన్ కంట్రీ మరో కుట్ర.. సిగ్నల్ యాప్‌పై అనధికారక వేటు.. ‘గ్రేట్ ఫైర్​వాల్​’తో అడ్డుకుంటున్న చైనా Highest Denomination Currency: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన..