Signal App Stops Working: డ్రాగన్ కంట్రీ మరో కుట్ర.. సిగ్నల్ యాప్‌పై అనధికారక వేటు.. ‘గ్రేట్ ఫైర్​వాల్​’తో అడ్డుకుంటున్న చైనా

Signal app: సిగ్నల్ యాప్​ను చైనా నిషేధించినట్లు సమాచారం. వీపీఎన్ లేకుండా ఈ యాప్​ను యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి..

Signal App Stops Working: డ్రాగన్ కంట్రీ మరో కుట్ర.. సిగ్నల్ యాప్‌పై అనధికారక వేటు.. 'గ్రేట్ ఫైర్​వాల్​'తో అడ్డుకుంటున్న చైనా
Follow us

|

Updated on: Mar 16, 2021 | 1:13 PM

సిగ్నల్ యాప్​ను చైనా నిషేధించినట్లు సమాచారం. వీపీఎన్ లేకుండా ఈ యాప్​ను యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు స్పష్టమవుతోంది.

వాట్సాప్​కు ప్రత్యామ్నాయంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సిఫార్సు చేసిన ఎన్​క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్-‘సిగ్నల్​’ను చైనా వేటు వేసినట్లుగా తెలుస్తోంది. చైనాలో ఈ యాప్​ను వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్‌ లేనిదే యాక్సెస్ చేయడం కష్టంగా ఉంది. దీంతో ఇతర అమెరికా సామాజిక మాధ్యమాల మాదిరిగానే దీనిపైనా ఆంక్షలు విధించినట్లు కనిపిస్తోందని టెక్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పటికే ఫేస్​బుక్, ట్విట్టర్ వంటి అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలను తమ పౌరులకు దూరంగా ఉంచింది డ్రాగన్ దేశం. ఇంటర్ నెట్‌పై పరిమితులు విధించేలా రూపొందించిన ‘గ్రేట్ ఫైర్​వాల్​’తో అనేక సైట్లను అడ్డుకుంటోంది అక్కడి సైబర్ విభాగం. నిషేధిత అంశాలపై చర్చించేందుకు రూపొందిన క్లబ్​హౌస్ అనే ఆడియో ప్లాట్​ఫాంను సైతం గత నెలలో నిలిపివేసింది చైనా.

వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన గోప్యతా విధానంతో చాలా మంది సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్​లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సిగ్నల్ డౌన్​లోడ్​ చేసుకుంటున్నవారి సంఖ్య చైనాలో నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. ఎలాన్ మస్క్ సైతం ఈ యాప్​ ఉపయోగించాలని సూచించడం వల్ల అంతర్జాతీయంగా ఈ మెసేజింగ్ యాప్​కు విశేష ప్రాచుర్యం లభించింది. దీంతో అయితే నిషేదం విధించినట్లుగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. కట్టడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి సెర్చ్ ఇంజన్‌ ప్లే స్టోర్‌లో అది కనిపించడం లేదు. దీంతో సిగ్నల్‌పై అనధికారికంగా వేటు పడిందని అనుకుంటున్నారు. సహజంగా చైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకున్న ఎలాంటి ప్రకటన చేయదని టెక్ విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Highest Denomination Currency: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన.. World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు Oye Bat Dikha: “తొలి అనుభావాన్ని” పంచుకున్న ఇషాన్‌ కిషన్.. కోహ్లీ చెబితే కానీ అర్థం కాలేదు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!