Oye Bat Dikha: “తొలి అనుభావాన్ని” పంచుకున్న ఇషాన్ కిషన్.. కోహ్లీ చెబితే కానీ అర్థం కాలేదు..
అరంగేట్రంలోనే దూకుడు ప్రదర్శించి సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు ఇషాన్ కిషన్. టీ20లోనే హాఫ్ సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20తో..
Ishan Kishan Makes Impactful Debut: అరంగేట్రంలోనే దూకుడు ప్రదర్శించి సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు ఇషాన్ కిషన్. టీ20లోనే హాఫ్ సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతను ధనాధన్ ఇన్నింగ్స్‌తో సత్తాచాటిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో రషీద్ బౌలింగ్‌లో వరుసగా రెండో సిక్సర్ కొట్టి తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇదే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న తర్వాత బ్యాట్ ఎత్తి సంబరాలు చేసుకోలేదు. అయితే కాసేపటి తర్వాత బ్యాట్ అప్ చేశాడు.
నిజం చెప్పాలంటే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి అయినట్లుగా తను అప్పటి వరకు తెలియదని అన్నాడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడావని కోహ్లి నాతో అన్న తర్వాతే తనకు అర్థమైందని వెల్లడించాడు.
కానీ అర్ధసెంచరీ తర్వాత తనకు బ్యాట్ ఎత్తే అలవాటు లేదని…. కానీ విరాట్ కోహ్లి.. బ్యాట్ ఎత్తి స్టేడియంలోని నలువైపులకు చూపెట్టు అని సూచించారని తెలిపాడు. ఇది నీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాబట్టి అందరికీ బ్యాట్‌ను చూపించు అని వెనకాల నుంచి అరిచాడు.
ఆ తర్వాతే బ్యాట్ ఎత్తి అభివాదం చేశా అని తొలి అనుభావాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఎందుకంటే అది కెప్టెన్ ఆదేశంగా భావించా… అలాంటి ఆటగాడితో కలిసి బ్యాటింగ్ చేయడం కొత్త అనుభూతినిచ్చింది. అతని స్థాయిని అందుకోవడానికి మొదట్లో ఇబ్బంది పడ్డా. అత్యున్నత స్థాయిలో రాణించాలంటే ఎలాంటి శరీర భాష ఉండాలో అర్థం చేసుకున్నానని ఇషాన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి…
Highest Denomination Currency: రూ.2000 నోట్ల ముద్రణపై కేంద్రం కీలక ప్రకటన..
World singles TT qualification: ప్రపంచ సింగిల్స్ టీటీ క్వాలిఫైయర్స్‌లో భారత ఆటగాళ్ల దూకుడు