Boris Johnson: ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. వాణిజ్య అంశాలపై చర్చ
Boris Johnson - India Visit: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిగ్జిట్ అనంతర పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే
Boris Johnson – India Visit: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిగ్జిట్ అనంతర పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే వాణిజ్య అవకాశాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా జాన్సన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. యూరోపియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత బోరిస్ తొలి అంతర్జాతీయ పర్యటన ఇదే కానుంది. భారత్, బ్రిటన్ దేశాల మధ్య వాణిజ్య చర్చలను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జాన్సన్ జనవరిలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కరోనా ఉధృతి పెరగడంతో జాన్సన్ ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో జరిగే జీ7 సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదస్సుకు ముందే ఇండియాలో పర్యటించాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్తులో ఇండో – పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది. బ్రెగ్జిట్ అనంతర వాణిజ్యం, ప్రభావానికి కొత్త మార్గాలు తెరిచేందుకు 11 దేశాల కూటమి (కాంప్రిహెన్సివ్ అండ్ ప్రొగ్రెసివ్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ సీపీటీపీపీ) లో చేరేందుకు బ్రిటన్ గతనెలలో దరఖాస్తు చేసింది.
అయితే దేశంలో మరోసారి కరోనా ఉధృతి పెరుగుతుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. జనవరిలో న్యూ కోవిడ్ స్ట్రేయిన్, అదే విధంగా బ్రిటన్ సెకండ్ వేవ్ కారణంగా జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. తాజాగా భారత్‌లో కేసులు పెరుగుతుండటం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. అయితే వచ్చే నెల నాటికి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: