AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లం గొంతునొప్పిని తగ్గిస్తుందా ?… ఎలా తీసుకుంటే తొందరగా ఉపశమనం లభిస్తుందంటే..

Ginger Benefits For Sore Thorat: అల్లం భారత్ వంటకాలలో ప్రధానంగా ఉండే ఆహార పదార్థం. దీనిలో కేవలం రుచిమాత్రమే కాదు ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి

అల్లం గొంతునొప్పిని తగ్గిస్తుందా ?... ఎలా తీసుకుంటే తొందరగా ఉపశమనం లభిస్తుందంటే..
Ginger
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2021 | 8:38 AM

Share

Ginger Benefits For Sore throat : అల్లం భారత్ వంటకాలలో ప్రధానంగా ఉండే ఆహార పదార్థం. దీనిలో కేవలం రుచిమాత్రమే కాదు ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా గొంతు నొప్పిని నివారించడంలో అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గొంతుకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అల్లం. ఒకటి గొంతు నొప్పిని తగ్గించడం, రెండవది ఇన్ఫెక్షన్లతో పోరాడం. కానీ అల్లంను కూరల్లో మాత్రమే తీసుకోవగలం. నేరుగా దీనిని తినలేం. అల్లంను ఏ విధంగా తీసుకుంటే గొంతుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం.

అల్లంలో ఉండే ఔషధగుణాలు..

ఇందులో బయోయాక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల ఆహారపదార్థాలలో లభించే ఫైటోన్యూట్రియెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే ఇందులో అత్యంత ప్రయోజనకరమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు, షోగాల్స్, జింజెరోల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గొంతు నొప్పిని తగ్గిస్తాయి. అలాగే అల్లం యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వైరల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడానికి సహాయపడతాయి.

ఓ అధ్యాయనం ప్రకారం 10 శాతం అల్లం సారం నోటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మజీవులైన స్ట్రెప్టోకోకస్ ముటాన్స్, కాండిడా అల్బికాన్స్, ఎంటెరోకాకస్ ఫీకాల్స్ పెరుగుదలను నిరోధిస్తుంది. అలాగే గొంతు నొప్పిని మరింత తీవ్రతరం చేసే వైరస్, బాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. అల్లం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి వివిధ వ్యాధుల నుంచి రక్షణం కలిగిస్తుంది. ఎండిన అల్లంతో పోలిస్తే ఫ్రేష్ అల్లంలో ఎక్కవగా యంటీ ఆక్సిడేటివ్ ప్రయోజనాలున్నాయి.

వ్యాధి నిరోధక ప్రభావాలు..

గొంతునొప్పితో బాధపడుతున్నవారికి అల్లం వారి శరీరంలోని శోథ నిరోధక ప్రోటీన్లను నిరోధించడంలో సహాయపడుతుంది. టాన్సిల్స్లిటిస్, ఫారింగైటిస్ నొప్పికి సహయపడుతుందని ఓ అధ్యాయనంలో వెల్లడైంది. దీర్ఘకాలిక టాన్సిల్స్లిటిస్ ఉన్న 10 మందిలో 7 మంది అల్లం తిన్న తర్వాత తీవ్రమైన టాన్సిలిటిస్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

అల్లంలోని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బ్యాక్టీరియా, వైరస్, వ్యాధికారక క్రిముల నుంచి అల్లం ఉపశమనం అందిస్తుంది. స్ట్రెప్ కలిగించే బ్యాక్టీరియాపై అల్లం సారం, యాంటీ బయాటిక్స్ ప్రభావంలో అల్లం కీలకపాత్ర పోషిస్తుంది.

అల్లం ఏవిధంగా తీసుకోవాలి..

ఒక అల్లం ముక్కను తీసుకోని.. దాని పైన ఉన్న బెరడును తొలగించాలి. ఆ తర్వాత దానిని తినడం మంచిది. అలాగే అల్లం టీ తీసుకోవడేం ఉత్తమం. కొన్ని వేడి నీళ్ళలో కాస్త అల్లం వేసి ఉడికిన తర్వాత దానిని వడకట్టాలి. ఆ తర్వాత ఆ రసాన్ని తాగడం వలన గొంతు సమస్యలను దూరం చేసుకోవచ్చు.

అల్లం ఎవరు తీసుకోకుడదు..

అల్లం చాలామందికి సురక్షితం కాదు. కొందరిలో అలర్జీని కలిగిస్తుంది. గర్బవతులు ఎక్కువగా అల్లం తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్య కలుగుతుంది.

Also Read:

పోషకాహార నిధి..నోరూరించే “గోధుమ రవ్వ హల్వా’..ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి..! టెస్ట్‌ అదుర్స్‌!!