- Telugu News Lifestyle Food These rules for eating food according to ayurveda will protect you from many dangerous diseases
Eating Food: ఆహారాన్ని ఇలా తింటే.. ఆరోగ్యం పదిలం.. ఆయుర్వేదం ఏం చెబుతుందంటే?
Ayurveda Food Habits: ఆయుర్వేదం ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆయుర్వేదం.. విలువలతో కూడిన ఆలోచనలను..
Updated on: Mar 16, 2021 | 12:55 PM

Ayurveda Food Habits: ఆయుర్వేదం ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆయుర్వేదం.. విలువలతో కూడిన ఆలోచనలను పెంపొందిస్తుంది. అయితే ఆయుర్వేదం ఆహారం తినే విషయంలోనూ గొప్ప సూచనలు చేస్తుంది. ఆహారం విషయంలో కొన్ని నియామాలను పాటించడం ద్వారా.. ఆరోగ్యవంతంగా ఉండవచ్చని ఆయుర్వేదం పేర్కొంటోంది.

మనిషిలో జీర్ణక్రియ బాగుండాలంటే కొన్ని ఆయుర్వేద మార్గదర్శకాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే మనిషి జర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా జరుగుతుందని పేర్కొంటున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఇంతకుముందు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమైనప్పుడు మాత్రమే తినాలని నిపుణులు పేర్కొంటున్నారు. లేకపోతే ఇది అజీర్ణానికి దారితీస్తుంది.

Eating Food

నాణ్యమైన ఆహారాన్ని, వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి. దీంతోపాటు భోజనంలో రసం, మజ్జిగ లాంటి ద్రవపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. పడని ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

సమయం లేదనో లేక అలవాటు ప్రకారమో చాలా మంది ఆహారాన్ని తొందతొందరగా మింగేస్తుంటారు. ఇది అస్సలు మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల జర్ణవ్యవస్థపై మరింత ఒత్తిడి పడుతుందని దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. కావున ఆహారాన్ని నములుతూ.. ఆస్వాదిస్తూ తినాలని సూచిస్తున్నారు.




