Gutti Vankaya Curry : ఆంధ్ర స్పెషల్ టేస్టీ టేస్టీ ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ విధానము..

తాజాగా కూరగాల్లో రాజా ఎవరంటే వంకాయని అంటారు ఎవరైనా.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వంకాయ ప్రముఖ కూరగాయ. ఉల్లి కారం పెట్టిన గుత్తి వంకాయ కూర అంటే ఎవరికైనా నోరు ఊరుతుంది.. ఈరోజు టేస్టీ టేస్టీ గుత్తివంకాయ కూర...

Gutti Vankaya Curry :  ఆంధ్ర స్పెషల్  టేస్టీ టేస్టీ  ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ విధానము..
Gutti Vanakyaa Curry
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2021 | 2:40 PM

Gutti Vankaya Curry : తాజాగా కూరగాల్లో రాజా ఎవరంటే వంకాయని అంటారు ఎవరైనా.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వంకాయ ప్రముఖ కూరగాయ. ఈ వంకాయల్లో చాలా రకాలున్నాయి. చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు ఇలా మార్కెట్లో దొరుకుతాయి. అయితే ఉల్లి కారం పెట్టిన గుత్తి వంకాయ కూర అంటే ఎవరికైనా నోరు ఊరుతుంది.. ఈరోజు టేస్టీ టేస్టీ గుత్తివంకాయ కూర తయారీ విధానం తెలుసుకుందాం..!

కావాల్సిన పదార్ధాలు :

లేత వంకాయలు కారం ఉల్లిపాయలు దాల్చిన చెక్క (చిన్నముక్క) ధనియాలు (రెండు స్పూన్లు) జీలకర్ర (ఒక టీ స్పూన్) లవంగాలు (ఐదు) యాలకులు(నాలుగు) అల్లం (చిన్న ముక్క) వెల్లుల్లి(8 రెమ్మలు) గసగసాలు (వేయించి రుబ్బి పెట్టుకున్న పేస్ట్ రెండు స్పూన్ ) కరివేపాకు పచ్చిమిర్చి 3 కొత్తిమీర (కొంచెం) ఉప్పు రుచికి సరిపడా పసుపు (ఒక టీ స్పూన్)

ఉల్లికారం తయారీ :

ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క , ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, అల్లం , వెల్లుల్లి, మిక్సీ వేసుకోవాలి.. (నీరు పోయకూడదు ) అనంతం ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని దానిలో కొంచెంకారం, గసగసాల పేస్ట్ ను వేసుకుని కలిపాలి. లేత వంకాయలను కడిగి పెట్టుకోవాలి. వాటిని మధ్యలో ప్లస్ లాగ కోసి (పురుగులు లేకుండా చూసుకోవాలి) అందులో ఈ మసాలా కూరాలి.అనంతరం ఒక బాణలి పెట్టి నూనె వేడి చేసుకోవాలి.. అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొనివెయించి.. మసాలా పెట్టుకున్న వంకాయలను వేసి మూత పెట్టుకోవాలి. వంకాయలు నూనెలో మగ్గిన తర్వాత మసాలా వేసి మూత పెట్టీ వేగనివ్వాలి.బాగా వేగిన కాసిని నీళ్ళు పొసి వుదికించుకోవలి. అయితే కూర కలిపే సమయంలో గుత్తి వంకాయలు విరగకుండా చూసుకోవాలి. చివరలో ఉప్పు కారం చూసి కొత్తిమీర వేసి దింపాలి. ఈ ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండగలరా.. ! ఇక గుత్తి వంకాయ కూడా చపాతీ లోకి కూడా బాగుంటుంది.

Also Read:

ఈ గ్రహాన్ని భూమి సోదరిగా పిలుస్తారు.. దీని మీద ఉష్ణోగ్రత 425 ° C.. మరిన్ని వివరాలు

17 సంవత్సరాల కిందటి కమర్షియల్ యాడ్.. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ అందులో ఉన్న స్పెషలెంటంటే..