Sailing Stones of Death Valley : మరణలోయలో కదిలే రాళ్లు.. రహస్యం కనిపెట్టేశామన్న శాస్త్రజ్ఞులు.. అయినా నమ్మని జనం
మనిషని మేధస్సుకు ఎప్పుడూ ప్రకృతి సవాల్ విసురుతూనే ఉంటుంది. తాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో వింతలూ, విశేషాలు కనిపెట్టేశాను అని మనిషి గర్వంగా ఫేస్ అయ్యే సమయంలో వెంటనే...
Sailing Stones of Death Valley : మనిషని మేధస్సుకు ఎప్పుడూ ప్రకృతి సవాల్ విసురుతూనే ఉంటుంది. తాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో వింతలూ, విశేషాలు కనిపెట్టేశాను అని మనిషి గర్వంగా ఫేస్ అయ్యే సమయంలో వెంటనే ఒక సరికొత్త విషయం కనుల ముందు దర్శనమిస్తుంది. అవును మానవుడు ప్రకృతి పై ఆధిపత్యం సాధించాను అనుకొనే ప్రతి సారి.. ప్రకృతిలో వింతలు కనుల ముందు దర్శనమిస్తాయి.. ప్రకృతి తన మాయ ను చూపిస్తుంది. అప్పుడు మనం ఆశ్చర్య పోవడం.. కొంతకాలం మన మేధస్సుకు పదును పెట్టి పరిశోదించడం.. అనంతరం దానికి ఓ తర్కంతో కూడిన వివరణ ఇవ్వడం పరిపాటి.. అటువంటి ఓ వింతను గురించి ఈరోజు మనం చెప్పుకుందాం..!
ఒక రాయి ఎవరి సహకారం లేకుండా దానంతట అదే కదలడం ఎపుడైనా చూశారా.. కనీసం ఇలా జరుగుతుంది అని ఊహించుకున్నారా..? ఆసాధ్యం అనుకుంటున్నారా..!! కానీ నిజంగా రాళ్ళు వాటంతట అవే కదులుతాయి. అది మరణ లోయలో అని చాలా మంది నమ్మకం.. ఇప్పటికే అనేక మంది ఈ రాళ్ళ కదలికపై ఎన్నో సిద్ధాంతాలు.. వివరణలు.. తర్కాలు… చెప్పారు.. అయితే వాటిల్లో ఏదీ అందరు నమ్మే విధంగా లేదు.. ఇంకా చెప్పాలంటే ఆ మరణలోయ అసలు రహస్యం కనిపెట్టలేకపోయారు.. మరణలోయలో కదిలే రాళ్ళ గురించి మనం పలు ఆసక్తి కరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
కాలిఫోర్నియాకు తూర్పున ప్రపంచంలోకెల్లా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం ఈ మరణలోయ. వంద సంవత్సరాలనుంచి ఈ మరణలోయ వెనుక ఏదో రహస్యం దాగి ఉంది. ఈ ప్రదేశంలో రాళ్ళు వాటంతట అవే కదులుతూ ఉంటాయని చాలా మంది పరిశోధకులు చెబుతారు.. అయితే ఈ రాళ్ళు ఎవరూ చూడని సమయంలో కదులుతూ ఉంటాయని చాలా మంది నమ్మకం.. ఇలా రాళ్ళు కదిలే ప్రాంతాన్ని “రేస్ ట్రాక్ ప్లాయా” అని అంటారు.. ఇది పొడి ప్రాంతం.. కదిలే రాళ్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పొడిగా ఉండే ప్రదేశం.. ఏదో అర్ధం కానీ దారులను చూచిస్తూ.. రాళ్ళు కదులుతున్నాయనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ రాళ్ళను మనుషులు కదిపుతున్నారని భావించడానికి.. ఆ రాళ్ళ వెనుక మనుషులు ఎవరూ ఉండరు.. ఇటువంటి బాహ్య శక్తి అవసరం లేకుండానే రాళ్ళు వాటంతట అవే… ఎవరూ చూడని సమయంలో ఇలా రాళ్ళు కదులుతున్నాయని బలమైన నమ్మకం..
అయితే ఇక్కడ వింత ఏమిటంటే ఈ ప్రదేశం లో ఉన్న అన్నీ రాళ్ళు కదలవు… కొన్ని రాళ్ళు మాత్రమే.. అదీ రెండు మూడు ఏళ్ళకు ఓ సారి మాత్రమే ఆ రాళ్ళు కదులుతాయట. అయితే అలా కదిలే రాళ్ళూ కూడా అన్నీ ఒకే దిశగా కదలడం లేదని… ఒక తెలియని శక్తి .. లేదా అయస్కాంత ప్రభావంతో ఈ రాళ్ళు కదులుతున్నాయని చాలా మంది నమ్మకం.. ఈ నమ్మలేని నిజంగురించి అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మరణ లోయలో రాళ్ళు కదలడానికి కారణం.. అత్యంత శక్తివంతమైన గాలులు వీచడం అని కూడా అంటారు.. అయితే వెంటనే మరి ఆ గాలికి అన్ని రాళ్ళు కదలాలి కదా..!! కానీ కొన్ని రాళ్ళు మాత్రమే ఎందుకు కదులుతున్నాయనే ప్రశ్న మళ్ళీ మదిలో చిగురిస్తుంది. ఈ రాళ్ళ కదలికపై భూ గర్భ శాస్త్ర పరిశోధకులు ఏమి చెబుతున్నారంటే.. గాలి, ఉష్ణోగ్రతల చర్య వల్లే అని అంటున్నారు.. అందుకనే ఈ కదిలే రాళ్ళు.. బురద ఉన్న ప్రదేశాల్లో వంకర టింకరగా వెళ్తున్నాయని అంటున్నారు.. ఇలా రాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక్క కాలిబాట కూడా ఏర్పడింది. మృత్యులోయలో నిజంగానే రాళ్ళు కదులుతున్నాయని చాలా మంది నమ్మకం..
ఈ డెత్ వాలీ లో రాళ్ళు అవి కదిలే సమయంలో నేలమీద కాలిబాటలు ఏర్పడతాయి. 700 పౌండ్ల బరువున్న కొన్ని రాళ్ళు 1,500 అడుగులకు పైగా ప్రయాణింస్తూ అబ్బురపరుస్తాయి. అయితే కొన్నేళ్లుగా పరిష్కారం కానీ ఈ విషయంపై 2014 లో పరిశోధకులు కొన్ని కారణాలు చెప్పారు. ఈ రాళ్ళూ కదలడానికి కారణం చెప్పారు. కొన్ని గాలులు ఉపరితలం మీదుగా రాళ్ళను ముందుకు నడిపిస్తాయని అవికదిలిన సమయంలో ఇలా బురదలో కాలిబాటలను ఏర్పడతాయని కదిలే శిలల రహస్యాన్ని శాస్త్రవేత్తలు ప్రపంచానికి వెల్లడించారు. అయినప్పటికీ దీనిని ఇంకా మిస్టరీగానే చూస్తున్నారు పర్యాటకులు
Also Read: