AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah wedding : టీవీ యాంకర్ తో ఏడడుగులు వేసిన పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా

టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా..  పెళ్లిపీటలు ఎక్కేసాడు. టీవీ యాంకర్‌ సంజన గణేషన్‌తో కలిసి ఏడు అడుగులు వేసాడు బుమ్రా. అయితే గతంలో బుమ్రా పెళ్లి విషయమై

Jasprit Bumrah wedding : టీవీ యాంకర్ తో ఏడడుగులు వేసిన పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా
Jasprit Bumrah
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2021 | 5:49 PM

Share

Jasprit Bumrah wedding : టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా..  పెళ్లిపీటలు ఎక్కేసాడు. టీవీ యాంకర్‌ సంజన గణేషన్‌తో కలిసి ఏడు అడుగులు వేసాడు బుమ్రా. అయితే గతంలో బుమ్రా పెళ్లి విషయమై చాలానే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో బుమ్రా కుటుంబసభ్యులు.. సంజనను వివాహం చేసుకుంటున్నట్టు తెలిపి  ఆ వార్తలు చెక్ పెట్టేసారు. గోవాలో ఇద్ద‌రి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీళ్ల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వ‌ధూవ‌రుల స‌న్నిహితులు కూడా కొంత‌మంది హాజరయ్యారు. ఆదివారమే పెళ్లికి ముందు జ‌రగాల్సిన వేడుక‌ల‌న్నీ పూర్తయిన‌ట్లు బుమ్రా స‌న్నిహితులు వెల్ల‌డించారు. ఇక పెళ్లిలో మొబైల్ ఫోన్ల వాడ‌కంపై కూడా ఆంక్ష‌లు ఉన్న‌ట్లు వాళ్లు తెలిపారు. కొవిడ్‌-19 కార‌ణంగా కేవ‌లంఅతంత సన్నిహితుల స‌మ‌క్షంలో మాత్ర‌మే బుమ్రా పెళ్లి జరిగింది. ఇందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.

మొదట్లో బుమ్రా హీరోయిన్‌ అనుపమపరమేశ్వరన్  వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను అనుపమపరమేశ్వరన్ ‌ కుటుంబసభ్యలు చెక్‌ పెట్టారు.  పెళ్లి కారణంగా  ఇంగ్లాండ్‌ చివరి టెస్ట్‌తో పాటు టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు బుమ్రా. ఇక సెలబ్రిటీలు, టీమిండియా అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాధ్యతలు తీసుకుంటున్న తారక్.. త్వరలోనే..

Tokyo Olympics 2021: త్వరలో ఒలింపిక్స్.. అడ్డంగా బుక్కైన భారత అథ్లెట్లు.. డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్..