- Telugu News Photo Gallery Viral photos Jasprit bumrah to tie the knot today with sanjana ganesan in goa
Photo Gallery: నేడే బుమ్రా-సంజనా గణేశన్ వివాహం.. ఆమె గురించి కొన్ని విశేషాలు మీకోసం
ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌ను భారత బౌలర్ నేడు బుమ్రా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో సంజనా గణేషన్ గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు?..వివరాలు..
Updated on: Mar 15, 2021 | 3:11 PM

ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన జస్‌ప్రీత్ బుమ్రా ఈ రోజు గోవాలో టీవీ యాంకర్ సంజన గణేశన్‌తో వివాహం చేసుకోనున్నారు. బుమ్రా, సంజన తమ బంధువులు మరియు సన్నిహితుల మధ్య ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకోనున్నారు.

మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. తర్వాత జర్నలిస్ట్‌గా మారి ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా సీజన్7తో తన కెరీర్ ప్రారంభించారు. సంజన ప్రస్తుతం ఐపీఎల్ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు

ఫెమినా మిస్ ఇండియా 2013 లో సంజన పాల్గొన్నారు. ఈ పోటీ తరువాత, ఆమె ప్రముఖ రియాలిటీ షో స్ప్లిట్స్విల్లా సీజన్ 7 లో భాగమైంది.

సంజన గత కొన్ని సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో కలిసి పనిచేస్తోంది. ఆమె ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది.

సంజన ప్రముఖ మేనేజ్‌మెంట్ గురువు గణేశన్ రామస్వామి కుమార్తె. రామస్వామి పూణేలోని అలనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ డైరెక్టర్





























