- Telugu News Photo Gallery Spiritual photos 700 years old lord ganesha statue on the edge of a volcano in indonesia
700 Years Ganesha: ఆ దేశ ప్రజలకు గణేశుడిపై ఎంతనమ్మకం అంటే.. తమ దేశ కరెన్సీపై కూడా విఘ్నేశ్వరుడిని ముద్రించుకునేటంత
భారతీయ హిందూ సంప్రదాయంలో పెళ్లి, వ్యాపారం, ఇలా ఏ పని మొదలు పెట్టినా విఘ్నలు కలగకుండా విజయవంతంగా జరగాలని మొదటి పూజను విగ్నేశ్వరుడికి నిర్వహిస్తాం. అయితే ఆ దేశ ప్రజలు మాత్రం అగ్ని పర్వతం బద్దలు కాకుండా తమను కాపాడమని పూజలు చేస్తున్నారు. రోజూ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు..
Updated on: Mar 15, 2021 | 1:57 PM

ముస్లిం దేశమైన ఇండోనేషియాలోని తూర్పు జావాలో 7,641 అడుగుల ఎత్తులో ఓ విగ్రహం ఉంది. ‘బ్రోమో అని పిలిచే విఘ్వేశ్వరుడి విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ గణేశుడుని తమ పూర్వీకులు అగ్నిపర్వతం ముందు ప్రతిష్టించారని టెంగ్గర్ మాసిఫ్ తెగ చెబుతుంది.

అయితే 2012 లెక్కల ప్రకారం ఈ దేశంలో 127 ప్రమాదకరమైన అగ్ని పర్వతాలున్నాయి. ఆ పర్వతాల పరిసర ప్రాంతాల చుట్టూ 5మిలియన్ల మంది జీవిస్తున్నారు. ఇక మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం సరిహద్దుల్లో నివసించే ప్రజలు..ఆ అగ్నిపర్వతం విస్పోటనం చెందకుండా తమను రక్షించమని లంబోదరుడిని పూజిస్తారు.

ఇక్కడ ప్రతిష్టించిన గణేషుడి విగ్రహం లావా రాళ్లతో 700 వందల ఏళ్ల క్రితం తయారు చేయబడింది. చుట్టుపక్కల 48 గ్రామాలోని 3 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వారు గణేశునికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తమను అగ్నిపర్వతాల నుంచి రక్షించే దేవుడు గణేషుడే అని నమ్ముతారు

ఈ గణేశుడు విగ్రహమే మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం బద్దలవ్వకుండా తమను కాపాడుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రతీరోజూ 'విది వాసా' పేరుతో స్థానిక ప్రజలు పండుగ జరుపుతారు. పండ్లు, పువ్వులను అగ్నిహోత్రం చేసి విఘ్నాలను తొలగించాలని కోరుకుంటారు. గణేశుని ఆరాధనకు ఎప్పుడూ అంతరాయం కలగదు. ఇక్కడ 'యద్నాయ కసాడా' అనే సంప్రదాయం ఉంది. ఇది వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన సంప్రదాయం. అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనాలు ఉన్నప్పటికీ ఆ పద్ధతి మాత్రం నిరంతరం కొనసాగుతోంది.

మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం ఎక్కడం మొదలు అయ్యే ప్రదేశంలో నల్ల రాళ్లతో తయారు చేయబడిన 9వ శతాబ్దపు బ్రహ్మ ఆలయం కూడా ఉంది. బ్రోమో అనే పేరుకు జావానీస్ భాషలో బ్రహ్మ అని అర్థం. ఇండోనేషియా ఇస్లామిక్ దేశంగా ఉన్నప్పటికీ అక్కడ గణేషుడిపై ఎంతో భక్తి .. అంటే నమ్మకం కూడా. అందుకనే ఇండోనేషియా 20 వేల నోట్లపై వినాయకుడి బొమ్మను ముద్రించారు కూడా
