Coronavirus: తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం.. మరి కొంతమంది విద్యార్థులకు పాజిటివ్‌

Tirumala Vedic School Students: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొరలు చాస్తోంది. ఇప్పటికే నిత్యం కేసులు భారగీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి

Coronavirus: తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం.. మరి కొంతమంది విద్యార్థులకు పాజిటివ్‌
corona-virus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2021 | 4:22 PM

Tirumala Vedic School Students: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొరలు చాస్తోంది. ఇప్పటికే నిత్యం కేసులు భారగీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనావైరస్‌ కలకలం రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య సిబ్బంది తాజాగా నిర్వమించిన పరిక్షల్లో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. టీటీడీ వేద పాఠశాలలో ఉంటున్న ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉపాధ్యాయులు, విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం పద్మావతి కోవిడ్‌-19 ఆసుపత్రికి తరలించారు.

ఇదిలాఉంటే.. ఈనెల 10న వేదపాఠశాలలో చదువుతున్న 57 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించగా.. తాజాగా 10 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో వేద పాఠశాలలో కరోనా సోకిన వారి సంఖ్య 67కి చేరింది. ఈ వేద పాఠశాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన సుమారు 420 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వారిలో చాలామందికి కరోనా సోకడంతో పిల్లల తల్లీదండ్రుల్లో ఆందోళన మొదలైంది. అయితే రాష్ట్రంలో కూడా ఒకేసారి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది.

Also Read:

నోటాపై ఎక్కువ ఓట్లు పోలైతే, ఎన్నిక చెల్లనిదిగా ప్రకటిస్తారా ? ‘పిల్’ పై కేంద్ర సమాధానానికి సుప్రీంకోర్టు ఆదేశం

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణ… భగవంతుడు, భక్తుల చెంతకు వెళ్లే దివ్యక్షేత్రం