Kamal Haasan: కమల్‌ హాసన్‌ వాహనంపై దాడికి యత్నం.. మద్యం మైకంలో ఓ యువకుడు హల్‌చల్‌

Tamil Nadu Election 2021 - Kamal Haasan: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎటుచూసినా ఎన్నికల హాడావుడి నెలకొంది. ఈ క్రమంలో

Kamal Haasan: కమల్‌ హాసన్‌ వాహనంపై దాడికి యత్నం.. మద్యం మైకంలో ఓ యువకుడు హల్‌చల్‌
Kamal Haasan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2021 | 2:52 PM

Tamil Nadu Election 2021 – Kamal Haasan: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎటుచూసినా ఎన్నికల హాడావుడి నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై ఓ మందుబాబు దాడికి యత్నించారు. ఈ ఘటనలో కమల్ హాసన్‌కు ఎలాంటి ప్రమాదం ఉరగకకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ కంచీపురంలో పర్యటించి తిరిగి హోటల్‌కు కారులో వెళుతుండగా ఓ యువకుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. మద్యం తాగి ఉన్న యువకుడు కమల్ హాసన్‌ను కలిసేందుకు కారును అడ్డుకోబోయాడు. ఈ ఘటనలో కారు అద్దం దెబ్బతింది. అయితే.. మద్యం తాగిన యువకుడు చేసిన దాడిలో కమల్ హాసన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, కారు అద్దం మాత్రమే పగిలిందని ఎంఎన్ఎం కార్యకర్తలు వెల్లడించారు.

కమల్ హాసన్‌పై దాడికి యత్నించిన యువకుడిని ఎంఎన్ఎం కార్యకర్తలు చుట్టుముట్టి కొట్టడంతో ముక్కు నుంచి రక్తస్రావం అయింది. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. కాగా కమల్‌పై యువకుడు దాడి చేసేందుకు యత్నించాడని.. దీంతో తమ కార్యకర్తలు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారని ఎంఎన్ఎం నాయకుడు, రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారి మౌర్యా ట్వీట్ చేశారు. అయితే దాడిచేసిన యువకుడు మద్యం తాగి ఉన్నాడని, కమల్ హాసన్‌ను చూడాలని కారు అద్దాన్ని పగులగొట్టాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఆ యువకుడిని వదిలిపెట్టారు.

Also Read:

MK Stalin Nomination: జనసంద్రమైన కొల్లాత్తూర్.. కేరింతలు.. హర్షధ్వానాల మధ్య తమిళనేతల నామినేషన్లు..

Bank Locker Rules and Regulations: మీరు బ్యాంకులో లాకర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా..? ఈ నియమ నిబంధనలు తెలుసుకోండి