AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటాపై ఎక్కువ ఓట్లు పోలైతే, ఎన్నిక చెల్లనిదిగా ప్రకటిస్తారా ? ‘పిల్’ పై కేంద్ర సమాధానానికి సుప్రీంకోర్టు ఆదేశం

ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో 'నోటా' పై ఎక్కువ ఓట్లు పోలైన పక్షంలో ఆ ఎన్నిక ఫలితాలను చెల్లనివిగా ప్రకటించాలని, మళ్ళీ కొత్తగా ఎన్నికలను నిర్వహించవలసిందిగా  ఈసీని ఆదేశించాలని  కోరుతూ దాఖలైన 'పిల్' పై సుప్రీంకోర్టు  విచారణ ప్రారంభించింది.

నోటాపై ఎక్కువ ఓట్లు పోలైతే, ఎన్నిక చెల్లనిదిగా  ప్రకటిస్తారా ?  'పిల్' పై కేంద్ర సమాధానానికి సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 15, 2021 | 2:54 PM

Share

ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘నోటా’ పై ఎక్కువ ఓట్లు పోలైన పక్షంలో ఆ ఎన్నిక ఫలితాలను చెల్లనివిగా ప్రకటించాలని, మళ్ళీ కొత్తగా ఎన్నికలను నిర్వహించవలసిందిగా  ఈసీని ఆదేశించాలని  కోరుతూ దాఖలైన ‘పిల్’ పై సుప్రీంకోర్టు  విచారణ ప్రారంభించింది. దీనిపై కేంద్ర సమాధానాన్ని కోర్టు తెలుసుకోదలిచింది.  పిటిషనర్ తరఫున వాదించిన లాయర్ మనేకా గురుస్వామి..  తిరస్కరించే హక్కు అంటూ ఒకటుందని,  ఆ హక్కును గుర్తించాలని తాము కోరుతున్నామని అన్నారు. (బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ పిల్ దాఖలు చేశారు). ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే, న్యాయమూర్తులు ఏ.ఎస్. బోపన్న, వి. రామసుబ్రమణ్యన్ లతో కూడిన బెంచ్   న్యాయ మంత్రిత్వ శాఖకు, ఈసీకి నోటీసులను జారీ చేసింది.

ప్రజలు తిరస్కరించిన అభ్యర్థులను కూడా మేనేజ్ చేయగలిగేలా ఓ రాజకీయ పార్టీ ఓటర్లను ప్రభావితం చేయగలిగినా … అప్పుడు  పార్లమెంటులో సీట్లు ఖాళీగా ఉంటాయని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. అయితే 50 శాతం నోటా ఓట్లను లెక్కించాలన్న నియమం ఉన్నప్పుడు  99  శాతం మంది ఒక అభ్యర్థిని నిరాకరిస్తే ఒక శాతం ఓట్లు ఎన్నికల ఫలితాన్నినిర్ణయిస్తామని న్యాయవాది గురుస్వామి అన్నారు.  ఇందుకు సీజేఐ…. ఇది రాజ్యాంగ సమస్యేనని, మీ వాదననే అంగీకరిస్తే నోటా కారణంగా అభ్యర్థులందరూ తిరస్కరణకు  గురైనప్పుడు ఆ నియోకజకవర్గానికి ఎలాంటి ప్రతినిధ్యమూ లేకుండా పోతుందని అన్నారు. ఆ పరిస్థితిలో ఇది చెల్లుబాటైన పార్లమెంట్ అని ఎలా అంటామని ఆయన ప్రశ్నించారు.  ఈ క్లిష్టమైన అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేయాలని సుప్రీంకోర్టు సూచించింది.  ఇప్పటికే ఈ విధమైన న్యాయ సంబంధ అంశాలపై గతంలో కూడా విస్తృత చర్చలు జరిగాయి. తాజాగా దీనిపై కేంద్ర వాదన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి: Kamal Haasan: కమల్‌ హాసన్‌ వాహనంపై దాడికి యత్నం.. మద్యం మైకంలో ఓ యువకుడు హల్‌చల్‌

Google New Features: ఓపెన్ చేయకుండానే వెబ్‌సైట్‌ను చూడొచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..