AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Wedding Wardrobe : ఫంక్షన్లకు భిన్నంగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. టాప్ టీవీ నటీమణుల వివాహ కలెక్షన్లు మీకోసం

పండగలు, పంక్షన్లకు రోజూ  కంటే భిన్నంగా ఆడవాళ్లు రెడీ అవుతారు. ముఖ్యంగా తాము ధరించే బట్టలు స్పెషల్ గా ఉండాలని కోరుకుంటారు. ఇక పెళ్లివేడుకకి అయితే తాము ధరించే బట్టలు తమను మరింత అందంగా చూపించాలని...

Best Wedding Wardrobe : ఫంక్షన్లకు భిన్నంగా రెడీ అవ్వాలనుకుంటున్నారా.. టాప్ టీవీ నటీమణుల వివాహ కలెక్షన్లు  మీకోసం
Tv Actresses With Their Bes
Surya Kala
|

Updated on: Mar 16, 2021 | 5:29 PM

Share

Best Wedding Wardrobe : పండగలు, పంక్షన్లకు రోజూ  కంటే భిన్నంగా ఆడవాళ్లు రెడీ అవుతారు. ముఖ్యంగా తాము ధరించే బట్టలు స్పెషల్ గా ఉండాలని కోరుకుంటారు. ఇక పెళ్లివేడుకకి అయితే తాము ధరించే బట్టలు తమను మరింత అందంగా చూపించాలని డిజైన్ చేయించుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మహిళలుఎటువంటి దుస్తులు ఎంచుకోవాలి ప్రముఖ టివి యాక్టర్స్ కొంతమంది శైలిని మీకు పరిచయం చేస్తాం..!

బుల్లి తెరపై హిందీలో పాపులర్ సీరియల్ హై మొహబ్బతేన్ ఫేమ్ దివ్యంకా త్రిపాఠి సాంప్రదాయ డ్రెస్ ను ధరించింది. పింక్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ దివ్యంకాను మరింత అందంగా చూపిస్తుంది. ఈ డ్రెస్ కు పీచు, పింక్ మరియు మ్యూట్ ఆరెంజ్‌మూడు షేడ్స్ తో కలిసిన దుప్పటి మరింత అందానిచ్చింది. ఆమె నగలు కూడా చాలా సింపుల్ గా ధరించడంతో డ్రెస్ కు మరింత అందంగా కనిపిస్తుంది.

సుర్బీ చంద్నా తన వివాహ కలెక్షన్ గా లెహంగా , జాకెట్టు ధరించింది. రెగ్యులర్ లెహంగాలకు భిన్నంగా ట్రై చేయాలనుకునేవారు ఈ లెహంగాను ట్రై చేయవచ్చు. సుర్బీ బూడిద రంగు లెహంగా కు పసుపు రంగు స్లీవ్ లెస్ జాకెట్టు ధరించింది. అయితే ఈ అమ్మడు మరింత అందాన్ని పెంచేలా నడుముకి వడ్డాణం వంటి నగతో పాటు.. గాజులు, చోకర్ నెక్లెస్ ధరించింది.

బిగ్ బాస్ సీజన్ 14 కంటెస్టెంట్ జాస్మిన్ భాసిన్ లెమెన్ కలర్ లెహంగాను ధరించింది. ఈ లెహంగా వివాహం, పండుగలలో ధరించడానికి బాగుంటుంది. లెహంగానే భారీగా డిజైన్ చేయడంతో నగలు వేసుకోలేదు.. ఒక్క చెవికి పోగులు మాత్రమే ధరించింది. అయినప్పటికీ జాస్మిన్ నిజంగా మల్లెలా అందంగా ఉంది.

మౌని రాయ్ భారతీయ సంప్రదాయాన్ని ప్రతిభింబిస్తూ.. చీరలో తళుక్కున మెరిసింది. మౌని సెల్ఫ్ ప్రింటెడ్ క్రీమ్-కలర్ సిల్క్ చీరను ధరించింది. చీరకు మ్యాచింగ్ బ్లౌస్ గా మెరూన్ రంగులో ఉన్న స్లీవ్ లెస్ జాకెట్టును ధరించి ఓరగా చూస్తుంది. కేశాలంకరణ కూడా భారతీయ ఉట్టిపడేలా ఉంది. ఇలాంటి అలంకరణలో పెళ్లి కూతురుగా కనిపిస్తే ఎవరైనా సరే పదే పదే చూడాల్సిందే..

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొన్న రుబినా దిలైక్ ఫ్యాషన్ పట్ల మంచి అభిరుచిగల మహిళగా గుర్తింపు పొందారు. ఆమె విజేతగా నిలవడానికి ఇది ఒక కారణం అని అంటారు. ఆమె నలుపు, బంగారం రంగు కలగలిపిన లెహంగా ను చోళీ ని ధరించింది. ఈ లెహంగా స్టైల్ పెళ్లి కి పంక్షన్లకు ఖచ్చితంగా సూట్ అవుతుంది. అంతేకాదు రుబీనా దిరించిన నగలు కూడా భారీగా ఉండి .. ఫంక్షన్ లో క్లాసీగా కనిపిస్తున్నాయి.

Also Read: వృద్ధదేశంగా మారుతున్న చైనా.. పెళ్లి వయసు తగ్గించి.. ఇద్దర్ని కనమని ఒత్తిడి

ఆట కంటే వడాపావ్‌ తినడమే ముఖ్యమా..! హిట్‌మ్యాన్‌పై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు..!