Child Policy in China : వృద్ధదేశంగా మారుతున్న చైనా.. పెళ్లి వయసు తగ్గించి.. ఇద్దర్ని కనమని ఒత్తిడి

చైనాలో యువతరం తగ్గిపోతుంది. రోజు రోజుకీ వృద్ధులు పెరిగిపోతూ వృద్ధ చైనా మారుతుందని అక్కడ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు.. అక్కడ యువత డబ్బు సంపాదన, కెరీర్ లో ఎదుగుదల అంటూ పెళ్లి,...

Child Policy in China : వృద్ధదేశంగా మారుతున్న చైనా.. పెళ్లి వయసు తగ్గించి.. ఇద్దర్ని కనమని ఒత్తిడి
Two Children Policy
Follow us
Surya Kala

|

Updated on: Mar 16, 2021 | 4:34 PM

Child Policy in China : చైనాలో యువతరం తగ్గిపోతుంది. రోజు రోజుకీ వృద్ధులు పెరిగిపోతూ వృద్ధ చైనా మారుతుందని అక్కడ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంతేకాదు.. అక్కడ యువత డబ్బు సంపాదన, కెరీర్ లో ఎదుగుదల అంటూ పెళ్లి, పిల్లలపై దృష్టి పెట్టడం లేదని పెద్ద ఎత్తున చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో అత్యున్నత స్థాయి రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్నట్లు ఆ నిర్ణయాలతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత మంగళవారం (మార్చి 14)జరిగిన సీపీపీసీసీ సమావేశంలో దేశం పురోభివృద్ధిలో స్త్రీ, పురుష పాత్రల గురించి వారి భాద్యత గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా లో ఇప్పటివరకూ ఉన్న వివాహ వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రేమ పెళ్లి వంటి అంశాలను స్కూల్ బుక్స్ లో చేర్చాలని ప్రతిపాదన చేశారు..

చైనాలో మూడు దశాబ్దాలకు పైగా ఒకే బిడ్డకు మాత్రమే పరిమితం చేసే ప్రజాదరణ లేని విధానాన్ని రద్దు చేస్తూ.. అన్ని జంటలకు ఇద్దరు పిల్లలు పుట్టడానికి దేశం అనుమతినిస్తూ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ గురువారం ప్రకటించింది. కుటుంబ నియంత్రణ విధానంతో ఆ దేశంలో లింగ నిష్పత్తిలో తేడాకు దారితీశాయని తెలిపింది, అంతేకాదు రెండో పిల్ల వద్దు అంటూ కొన్ని సార్లు బలవంతపు గర్భస్రావం వంటి కౄరమైన చర్యలు కూడా చోటూ చేసుకున్నాయని తెలిపింది.

1.4 బిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా, అప్పటి జనాభా పెరుగుదల నివారణ కోసం నీరు మరియు ఇతర వనరుల డిమాండ్లను పరిమితం చేయడానికి తాత్కాలిక చర్యగా 1979 లో వన్-చైల్డ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు జనన రేటు పతనం కావడమేకాదు.. యువతరం తగ్గిపోతుంది. దీంతో భవిష్యత్ లో సంక్షోభం తలెత్తనున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువ కార్మికుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని జనాభా వృద్ధి రేటును పెంచకపోతే, అతి త్వరలో పెను సంక్షోభం ఏర్పడనుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ ప్రొఫెసర్ కై యోంగ్ అన్నారు.  హాంకాంగ్ యొక్క చైనీస్ విశ్వవిద్యాలయంలో చైనీస్ రాజకీయ నిపుణుడు విల్లీ లామ్ చెప్పారు. శ్రామిక జనాభాలో నలుగురు లో ముగ్గురు వృద్ధులు ఉండనున్నారని.. ఈ పరిస్థితి 20 సంవత్సరాలలో లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో జరగనున్నదని చెప్పారు.

Also Read:  చైనా రాజధాని బీజింగ్ ను ముంచెత్తిన ఇసుక తుఫాన్.. శ్వాసకోశ వ్యాధులున్నవారికి ప్రభుత్వం హెచ్చరిక

 మహేష్ బాబు ను డైరెక్ట్ చేయనున్న అర్జున్ రెడ్డి దర్శకుడు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో