AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandstorm in China : చైనా రాజధాని బీజింగ్ ను ముంచెత్తిన ఇసుక తుఫాన్.. శ్వాసకోశ వ్యాధులున్నవారికి ప్రభుత్వం హెచ్చరిక

డ్రాగన్ కంట్రీ రాజధాని బీజింగ్ గోధుమ వర్ణాన్ని సంతరించుకుంది. గత దశాబ్దపు కాలంలో ఎన్నడూ లేనంతగా ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. డీఎంతో నగరం అంతా ఇసుకతో నిండిపోయింది. ...

Sandstorm in China : చైనా రాజధాని బీజింగ్ ను ముంచెత్తిన ఇసుక తుఫాన్.. శ్వాసకోశ వ్యాధులున్నవారికి ప్రభుత్వం హెచ్చరిక
Sandstorm In China
Surya Kala
|

Updated on: Mar 16, 2021 | 3:50 PM

Share

Sandstorm in China :  డ్రాగన్ కంట్రీ రాజధాని బీజింగ్ గోధుమ వర్ణాన్ని సంతరించుకుంది. గత దశాబ్దపు కాలంలో ఎన్నడూ లేనంతగా ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. డీఎంతో నగరం అంతా ఇసుకతో నిండిపోయింది. ఈ తుఫాన్ ను దాదాపు దశాబ్దం తర్వాత బీజింగ్ ప్రజలు ఈ స్థాయిలో ఇసుక తుఫాన్ ను చూసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇసుక తుఫాన్ తో కోలోమీటర్ దూరంలో ఏమి ఉందొ కూడా కనపడని పరిస్థితి.. ఇక వాయు కాలుష్యం దీంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మరింత దారుణంగా మారిపోయాయి. ఇక ఈ తుఫాన్ ప్రభావం బీజింగ్ తో పాటు పన్నెండు ప్రావిన్సులపై ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ ఇసుక తుఫాన్ ను ఉత్తర మంగోలియాలో ప్రారంభమైందని.. దీనికి ఎగువన ఉన్న చలిగాలులు తోడవడంతో తీవ్ర రూపం దాల్చిందని.. అలా గాలి దిశను అనుసరిస్తూ దక్షిణాన ఉన్న బీజింగ్ వైపు వచ్చిందని చైనా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో గోబీ ఏడారిలోని దుమ్ము, ధూళి ఇసుక బీజింగ్‌ను ముంచెత్తుతోందని పేర్కొంది. ఇసుక తుఫాన్ కారణంగా పాఠశాలకు సెలవలు ప్రకటించింది. బహిరంగంగా నిర్వహించే కార్యక్రమాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

అయితే వాతావరణంలోని మార్పులతో శ్వాసకోస వ్యాధులున్నవారు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బీజింగ్ లో ఉన్న వాతావరణ పరిస్థితి ఇదంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రోజు రోజుకీ బీజింగ్ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న పట్టణీకరణ తగ్గుతున్న అడవుల కారణంగా తుఫాన్లు తాకిడి ఎక్కువ అవుతుందని అధికారులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఇంతటి తీవ్రమైన తుఫానును గత పదేళ్లలో ఎన్నడూ చూడలేదని బీజింగ్ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

బీజింగ్ లో 1950 లో ఇసుక తుఫాను ప్రభావిత రోజుల సంఖ్య గరిష్టంగా 26 రోజులుండగా.. 2010 తరువాత కేవలం మూడు రోజులకు పడిపోయిందని చైనా ప్రముఖ వార్తా పత్రిక తెలిపింది, ఇక ఇసుక తుఫాన్ నుంచి రక్షణ కోసం 2000 నుండి, చైనా ప్రభుత్వం బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది. ఇసుక తుఫాన్ నివారణ కోసం అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. పర్యావరణ ప్రాజెక్టులను ప్రారంభించారు . ఇసుక తుఫానులను పర్యవేక్షించడానికి ముందస్తుగా వాతావరణ సంస్థలను అప్రమత్తం చేయడానికి ఉపగ్రహాలను కూడా ఏర్పాటు చేసింది.

Also Read:

డ్రాగన్ కంట్రీ మరో కుట్ర.. సిగ్నల్ యాప్‌పై అనధికారక వేటు.. ‘గ్రేట్ ఫైర్​వాల్​’తో అడ్డుకుంటున్న చైనా

భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందే.. మ‌ద్దతు పలికిన పోర్చుగ‌ల్‌..