Credit Card New Rules : క్రెడిట్ కార్డులపై కరోనా వైరస్ ప్రభావం.. వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్న బ్యాంక్‌లు
క్రెడిట్ కార్డు వినియోగదారులు రోజు రోజుకీ అధికమయ్యారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపు వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకు తగినట్లుగా మెగా షాపింగ్ మాల్స్ లో...
Credit Card New Rules : క్రెడిట్ కార్డు వినియోగదారులు రోజు రోజుకీ అధికమయ్యారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపు వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డు ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకు తగినట్లుగా మెగా షాపింగ్ మాల్స్ లో కూడా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేసే వారు .. ఈజీగా క్రెడిట్ కార్డును ఇస్తున్నారు. అయితే ఇక నుంచి వినియోగదారులు క్రెడిట్ కార్డులను పొందడం ఈజీ కాకపోవచ్చు.
సిబిల్ స్కోర్ బాగున్నవారికి మాత్రమే ఇక నుంచి క్రెడిట్ కార్డులను ఇవ్వాలని తాజాగా బ్యాంక్ లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం క్రెడిట్ కార్డు చెల్లింపుదారుల బకాయిలు ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక నుంచి కొత్తగా క్రెడిట్ కార్డులను ఇష్యు చేసే సమయంలో క్రెడిట్ స్కోర్ తో పాటు.. ఇంటర్నల్ రూల్స్ ను చుడనున్నాయి. అంతేకాదు ఇప్పటికే క్రెడిట్ కార్డులను వాడుతున్న వారి లిమిట్ ను తగ్గించడానికి బ్యాంక్ లు రెడీ అవుతున్నాయి. బ్యాంక్ లో రుణాలు మంజూరు చేసే ముందు వినియోగదారుల క్రెడిట్ స్కోర్ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ కస్టమర్కు ఇచ్చే లోన్ అంత సేఫ్ అని భావిస్తాయి.
ఇంతకు ముందు సిబిల్ స్కోర్ 700 లు ఉంటె.. కార్డులు ఇచ్చేవారు.. ఇక నుంచి ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ స్కోర్ 780 ఉంటే గానీ కార్డులను ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇక క్రెడిట్ కార్డులను ఇచ్చే సమయంలో ఒక్క సిబిల్ స్కోర్ మాత్రమే కాదు.. ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఏవియేషన్, హాస్పిటాలిటీ వంటి కొన్ని సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రెడిట్ కార్డులను ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు ఇష్టపడడం లేదని ఆర్ధిక నిఫుణులు చెబుతున్నారు.
కరోనా తర్వాత అన్సెక్యూర్డ్ లోన్లను ఇవ్వడంపై రూల్స్ను బ్యాంకులు కఠినతరం చేశాయి. ఇదే కేటగిరీ కిందకు క్రెడిట్ కార్డులు కూడా వస్తాయి. ఆర్బీఐ డేటా ప్రకారం 2019 లో మార్చి-డిసెంబర్ మధ్య క్రెడిట్ కార్డు మొండిబాకీలు 17.5 శాతం పెరిగాయి. కిందటేడాది మారటోరియం కొనసాగినా ఇదే టైమ్లో ఈ మొండిబాకీలు 4.6 శాతం పెరగడం విశేషం. మారటోరియం వలన బ్యాంకులు లోన్లను మొండిబాకీలుగా ప్రకటించలేదు. మరోవైపు కరోనా టైమ్లోనూ డీఫాల్ట్ కాని కస్టమర్లకు బ్యాంకులు అదనపు రివార్డులను ఇస్తున్నాయి. వారి క్రెడిట్ లిమిట్ ను పెంచుతున్నాయి. అంతేకాదు కరోనా సమయంలోను క్రెడిట్ బిల్లులను రెగ్యులర్ గా చెల్లించిన వినియోగదారులకు కొన్ని బ్యాంక్ లు స్పెషల్ ఆఫర్లను కూడా ఇస్తున్నాయి.
Also Read: