AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 5 TV Shows: టీఆర్పీ రేటింగ్‏లో దూసుకుపోతున్న సీరియళ్లు.. టాప్ ప్లేస్‏లో ఉన్నవి ఇవే..

శ్రీరామ్ వెంకట్, వర్షా హెచ్‏కే జంటగా నటిస్తున్న సీరియల్ 'ప్రేమ ఎంత మధురం' వరుసగా మరోసారి టీఆర్పీ రేటింగ్‏లో సత్తా చాటింది. ఈ సీరియల్లో అను, ఆర్యవర్ధన్ల మధ్య

Top 5 TV Shows: టీఆర్పీ రేటింగ్‏లో దూసుకుపోతున్న సీరియళ్లు.. టాప్ ప్లేస్‏లో ఉన్నవి ఇవే..
Prema Entha Maduram Serial
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2021 | 2:32 PM

Share

శ్రీరామ్ వెంకట్, వర్షా హెచ్‏కే జంటగా నటిస్తున్న సీరియల్ ‘ప్రేమ ఎంత మధురం’ వరుసగా మరోసారి టీఆర్పీ రేటింగ్‏లో సత్తా చాటింది. ఈ సీరియల్లో అను, ఆర్యవర్ధన్ల మధ్య వచ్చే కొన్ని ఆకర్షణీయమైన సన్నివేశాలు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. 40 సంవత్సరాల వ్యక్తికి 19 ఏళ్ళ అమ్మాయి మధ్య చిగురించే ప్రేమ కథే ఈ సీరియల్. జీ తెలుగులో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో అను, ఆర్యల మధ్య కెమిస్ట్రీ, వారి అసాధారణమైన ప్రేమకథతోపాటు బ్యాక్ స్టోరీకి సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది.

మొన్నటి వారంలో ఆషికా పదుకొనే, చందుగౌడ, విష్ణుప్రియ నటించిన త్రినయని స్థానంలోకి ప్రేమ ఎంత మధురం చేరింది. ఈ రెండు సీరియళ్ల మధ్య గట్టి పోటి ఉంటుంది. అంతకుముందు ఐదవ స్థానంలో నిలిచిన త్రినయని ఇప్పటికీ ఎదురులేకుండా కొనసాగుతుంది. మరోవైపు కార్తీక దీపం మరోసారి టాప్‏లో నిలిచింది. ఇందులో నరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వానాథ్ నటిస్తున్న ఈ సీరియల్ 2017లో ప్రారంభమైంది. ఇటీవల దీప తన ఇద్దరు కుమార్తెలు హిమా, సౌర్యలతో తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కార్తీక దీపం టీఆర్పీ రేటింగ్‏లో సత్తా చాటుతుంది. ఈ సీరియల్స్ తర్వాత హరికృష్ణ, శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఇంటింటి గృహలక్ష్మీ, కార్తీక దీపం తర్వాతీ స్థానంలో నిలిచింది. ఇక అర్జున్ అంబటి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దేవత సీరియల్ మూడవ స్థానంలో నిలిచింది. ఇటీవల ప్రారంభమైన గుప్పెడంత మనసు సీరియల్ నాల్గవ స్థానంలో నిలిచింది.

Also Read:

17 సంవత్సరాల కిందటి కమర్షియల్ యాడ్.. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ అందులో ఉన్న స్పెషలెంటంటే..

బిగ్‏బాస్ విన్నర్ పై కేసు నమోదు.. కరోనా వచ్చినా షూటింగ్‏లో పాల్గొనడంపై పోలీసుల ఆగ్రహం..

RRR Movie: సీత మెడలోని పులిగోరు.. రామరాజు చేతుకు ఎందుకు వచ్చినట్లు.. భలే పాయింట్‌ పట్టుకున్న నెటిజన్లు..

Anand Devarakonda : వరుస సినిమాలతో దూసుకుపోతున్న మిడిల్ క్లాస్ హీరో.. కొత్త ప్రాజెక్ట్‌లు ఏంటో తెలుసా..